Tomato Price : కిలో టమాటా ధర 4 రూపాయలు.. రోడ్ల మీద పడేసి వెళ్తున్న రైతులు.. పశువులకు ఆహారంగా టమాటాలు.. వీడియోలు వైరల్

Advertisement

Tomato Price : ఒక్క నెల వెనక్కి వెళ్దామా? ఒక్క నెల వెనక్కి వెళ్తే పావుకిలో టమాటాలు కూడా కొనని రోజులు అవి. అవును.. ఏకంగా టమాటాలు కిలో 200 అయిన రోజులు అవి. కానీ.. ఇప్పుడు చూస్తే కిలో టమాటా ధర ఎంతో తెలుసా? 4 రూపాయలు. ఇంకో చోట అయితే 40 పైసలే. అంటే అర్ధరూపాయి కూడా కాదు. అంత తక్కువ ధరకు అమ్మినా రైతులకు వచ్చే డబ్బులు ఎన్ని. అసలు మార్కెట్ కు వాహనంలో తీసుకెళ్లడానికి పెట్రోల్ ఖర్చులు, రవాణా ఖర్చులకు కూడా టమాటాలు అమ్మితే డబ్బులు రాకపోతే ఇక వాటిని అమ్మడం ఎందుకు. వాటిని అమ్మితే లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టమే వస్తుందంటే ఇక ఆ రైతు ఏం చేయాలి చెప్పండి.

Advertisement

తాజాగా అదే జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.4 పలుకుతోంది. దీంతో చేసేది లేక మార్కెట్ కు తెచ్చిన టమాటాలను అమ్మలేక, మళ్లీ తిరిగి వాటిని తీసుకెళ్లలేక రోడ్ల మీద పడేసి వెళ్తున్నారు రైతులు.ఇక.. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ లో టమాటా ధర భారీగా పతనం అయింది. కిలో టమాటా ధర అక్కడ 40 పైసలుగా ఉంది. గిట్టుబాటు ధరలేక రోడ్లపైనే పారబోసి వెళ్లారు రైతులు. పశువులకు ఆహారంగా మారిపోయాయి.

Advertisement
tomato price dropped drastically in kurnool market
tomato price dropped drastically in kurnool market

Tomato Price : నంద్యాల ప్యాపిలి మార్కెట్ లో భారీగా పతనమైన టమాటా ధర

కొన్ని రోజుల కింద రూ.150, రూ.200 కిలో ధర ఉన్న టమాటా ధరలు ఇప్పుడు చూస్తే 4 రూపాయలు, 2 రూపాయలు, 40 పైసలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీద టమాటాలను పడబోసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Advertisement