Viral News : భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral News : భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌..!

Viral News  : పాట్నా: బిహార్‌లో అసాధారణ వివాహాలు ఇటీవ‌లి కాలంలో సర్వసాధారణంగా మారాయి. ముజఫర్‌పూర్ జిల్లా భౌరా కలాన్ గ్రామంలో ఓ మహిళ తన అల్లుడితో కలిసి లేచిపోయిన‌ సంచలన ఘటన చోటుచేసుకుంది. వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియదు. వారంతా షాక్‌కు గురయ్యారు. దాంతో ఆ ఏరియాలో గాసిప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఆ మహిళ కుమార్తె పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌..!

Viral News  : పాట్నా: బిహార్‌లో అసాధారణ వివాహాలు ఇటీవ‌లి కాలంలో సర్వసాధారణంగా మారాయి. ముజఫర్‌పూర్ జిల్లా భౌరా కలాన్ గ్రామంలో ఓ మహిళ తన అల్లుడితో కలిసి లేచిపోయిన‌ సంచలన ఘటన చోటుచేసుకుంది. వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియదు. వారంతా షాక్‌కు గురయ్యారు. దాంతో ఆ ఏరియాలో గాసిప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఆ మహిళ కుమార్తె పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

తాజాగా బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో మ‌రోక ర‌క‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. గోపాల్‌గంజ్‌లోని కుచాయికోట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికే వివాహం అయ్యింది. అంతా సజావుగా సాగుతుందని భావిస్తుండగా ట్విస్ట్ చోటుచేసుకుంది.మ‌హిళ తను క‌ట్టుకున్న భ‌ర్త‌ను వదిలేసి త‌న‌ మేనకోడలు మెడలో మంగళసూత్రాన్ని కట్టింది. వీరిద్దరు కుటుంబ సభ్యులు, బంధువులను కాదని ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. కోడలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. అత్త భర్తను, కుటుంబాన్ని వదిలేసి మేనకోడలి కోసం వచ్చేసింది. అత్తా కోడళ్లు వివాహం చేసుకున్నారు.

Viral News భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌

Viral News : భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌..!

హిందూ సంప్రదాయాల ప్రకారం దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. అనంత‌రం వారిరువురు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశారు. ఇక‌పై ఒక‌రినొక‌రు విడిచిపెట్ట‌మ‌ని ప్ర‌మాణాలు చేసుకున్నారు. వివాహ వేడుకను ఈ జంట సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్త, ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది