Viral Video : దలే రైలు ఎక్కబోయి కింద పడిపోయిన యువకుడు.. చివరికి ఇలా బ్రతికి పోయాడు..!
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాలో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు భయానకంగా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో ఒక యువకుడు రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. కదిలే రైలును ఎక్కవద్దని రైల్వే అధికారులు ఎంత చెప్పినా రైలు వెళ్ళిపోతుంది […]
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాలో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు భయానకంగా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో ఒక యువకుడు రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. కదిలే రైలును ఎక్కవద్దని రైల్వే అధికారులు ఎంత చెప్పినా రైలు వెళ్ళిపోతుంది అన్న ఆత్రుతలో అధికారులు సూచనలు మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
అయితే అదృష్ట అదృష్టవశాత్తు కొంతమంది బ్రతికి బయటపడతారు. కదిలే రైలు ఎక్కబోయిన ఓ యువకుడి విషయంలో ఇలాంటి సంఘటన జరిగింది. పెద్ద ప్రమాదం నుంచి అతడు అద్భుతంగా బయటపడ్డాడు. రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోయిన వెంటనే అతడు క్షేమంగా లేచి నిలబడ్డాడు. ఈ సంఘటన బీహార్లో బగాహా రైల్వే స్టేషన్లో జరిగింది. 24 ఏళ్ల ప్రతీక్ కుమార్ అనే యువకుడు రైలులో ప్రయాణిస్తున్నాడు. స్నాక్స్ కోసం రైలు దిగాడు. స్నాక్స్ కొనుక్కొని రైలు దగ్గరికి వెళ్తుండగా అది కదిలింది. ఈ క్రమంలోనే పరిగెత్తి కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, కదిలే రైలు మధ్య ఇరుక్కుపోయాడు.
ఈ ఘటనను గమనించిన పోలీసు అధికారి అతడికి సాయం చేశారు. అక్కడే స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ, ఇతర ప్రయాణికులు అతడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రైలు అప్పటికే బయలుదేరింది. రైలు వెళ్లేంతవరకు అతడిని కదలకుండా అక్కడే నక్కి కూర్చోమని సలహా ఇచ్చారు. ట్రాక్ పై నేరుగా పడుకోమని చెప్పారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. రైలు వెళ్లిపోయాక స్వల్పంగా గాయపడిన ఆ యువకుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
पश्चिम चंपारण के बगहा स्टेशन पर ट्रेन पकड़ने के दौरान पटरियों पर #गिरा_शख्स
ऊपर से गुजर गई पूरी #ट्रेन, सही सलामत बच गया शख्स@RailwaySeva pic.twitter.com/SMKEQy0NUA
— Goldy Srivastav (@GoldySrivastav) September 30, 2023