Viral Video : పుష్ప ఫీవర్ మామూలుగా లేదుగా.. అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా తగ్గేదే లే అంటూ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : పుష్ప ఫీవర్ మామూలుగా లేదుగా.. అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా తగ్గేదే లే అంటూ..

Viral Video : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. కేవలం తెలుగు నాటే అని కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా పుష్ప ప్రకంపనలు పుట్టించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పలికిన డైలాగులు, చేసిన డ్యాన్స్ స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 March 2022,1:00 pm

Viral Video : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. కేవలం తెలుగు నాటే అని కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా పుష్ప ప్రకంపనలు పుట్టించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పలికిన డైలాగులు, చేసిన డ్యాన్స్ స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు అన్నీ పెద్ద హిట్ అయ్యాయి. వీటిని హిట్ అనేకంటే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అని అనడం సబబు.

ఎందుకంటే పుష్ప ఫీవర్ కొంత మందికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలెబ్రెటీలు పుష్ప డైలాగులతో హోరెత్తించారు. అల్లు అర్జున్ మేనరిజంతో అలరించారు. 2021 డిసెంబర్ 17 విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా కోట్లను కొల్లగొట్టింది. నిర్మాతలకు ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన చాలా మంది సెలెబ్రెటీలు పుష్ప ‘తగ్గేదేలే’ అంటూ వీడియోలు చేశారు.

viral video in Born child puspa Movie Dialog in Taggedele

viral video in Born child puspa Movie Dialog in Taggedele

Viral Video : అప్పుడే పుట్టిన బుడ్డోడు కూడానా..

ఇక శ్రీ వల్లి పాటకు కూడా కొంత మంది వైరల్ స్టెప్పులేశారు. లోక జ్ఞానం తెలిసిన వారయితే ఏమో అనుకోవచ్చు కానీ అప్పుడే పుట్టిన బుడ్డోడికి కూడా పుష్ప ఫీవర్ అంటుకుంది. ఆ బుడ్డోడు కూడా తన గడ్డం మీద చేతులను పెట్టుకుని తగ్గేదేలే అంటున్నట్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి… ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది