Viral Video : హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్.. తల్లిదండ్రులు టీచర్ పై కేసు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్.. తల్లిదండ్రులు టీచర్ పై కేసు..!

Viral Video : ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Viral Video : హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్.. తల్లిదండ్రులు టీచర్ పై కేసు..!

Viral Video : ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని పిల్లాడిని చావబాదాడు అక్కడ టీచర్ సతీష్. అది కాస్త సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. పిల్లాడు దెబ్బలతో ఇంటికి రావడంతో స్కూల్ కి వెళ్లి సీసీ ఫుటేజ్ చూసిన పేరెంట్స్ ఆ టీచర్ పై పోలీస్ కేసు పెట్టారు. ఆరో తరగతి చదువుతున్న విద్యార్ధిని చావబాదే సరికి తన పిల్లాడి ఒంటిపై దెబ్బలు చూసిన తల్లిదండ్రులు టీచర్ ని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం పై కూడా పేరెంట్స్ ఫైర్ అయ్యారు.

Viral Video కనీస అర్హత లేని వారిని పెట్టుకోవడం..

ఎలాంటి అనుభవం ఇంకా టీచర్ గా కనీస అర్హత లేని వారిని పెట్టుకోవడం వల్లే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. పిల్లాడికి చెప్పాల్సిన విధంగా చెప్పాలి లేదంటే వారి పేరెంట్స్ కు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప హోమ్ వర్క్ చేయలేదని వారిని చితకబాదడం లాంటి పనుల వల్ల టీచర్స్ అంటేనే ఒక అపకీర్తి వచ్చేలా చేస్తున్నారు.

Viral Video హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్ తల్లిదండ్రులు టీచర్ పై కేసు

Viral Video : హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్.. తల్లిదండ్రులు టీచర్ పై కేసు..!

ఐతే ఈ విషయంలో టీచర్స్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధమవుతుంది. టీచర్ సతీష్ ని పోలీసులు విచారిస్తుండగా కేసు తర్వాత ఏమైంది అన్నది ఇంకా బయటకు రాలేదు.విద్యార్ధుల మీద తన ఇంటి దగ్గర ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నందు వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా విద్యార్ధులను బయట పెట్టాలి చదివేందుకు ఆసక్తి కలిగేలా చేయాలి కానీ ఇలా చావబాఇతే ఇంకోసారి వారు స్కూల్ కు వెళ్లేందుకు కూడా భయపడతారని చెప్పొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది