Viral Video : వామ్మో.. బైక్‌ను ఇలా కూడా నడుపుతారా? వీడియో వైరల్..!
Viral Video : బైక్ నడపడం అంటే అందరికీ సరదానే.. చాలా మంది నేర్చుకునే క్రమంలో అనేక ఇబ్బందులు పడతారు. మరి కొందరు కాస్త ఈజీగానే నేర్చుకుంటారు. ఇక కొత్త వారికైతే ఎప్పుడెప్పుడు బైక్‌ను డ్రైవ్ చేద్దామా? అనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది కింద పడి ప్రమాదాలకు సైతం గురవుతుంటారు.
ఇంకొందరైతే వాటితో స్టంట్స్ చేస్తూ ఎదుటి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసే క్రమంలో కొందరు సక్సెస్ కాగా.. మరి కొందరు కొంద పడి పరువుపోగొట్టుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం రోడ్డుపై బైక్‌ను గింగిరాలు తప్పించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఓ వ్యక్తి తన బైక్ పై బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తూ కొస్త బ్రేక్ కొట్టాడు.

Viral Video the bike stunt faded
Viral Video : మామూలుగ లేదుగా..
అనంతరం బైక్ ను రోడ్డు పైనే తిప్పతూ అదరగొట్టాడు. అలా సుమారుగా రోడ్డుపైనే 5 నుంచి 6 సార్లు బైక్ ను గుండ్రంగా తిప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొదటగా కారు అడ్డం వచ్చిందని బ్రేక్ కొట్టాడేమో అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది అతడు స్టంట్స్ చేసేందుకే అలా చేశాడని. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
Yok artık müthiş ????♥️???????????? pic.twitter.com/sxP7weGMA2
— yok artık (@yokartik_ya) February 16, 2022