Viral Video : ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. వీడియో వైరల్!
Viral Video : ఏనుగులు భారీ ఆకారంలో ఉండి జనం దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. దేశంలో ఏనుగుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. అయితే, మనదగ్గర కొందరు ఏనుగులను పెంచుకుంటుంటారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, సిక్కింతో పాటు దక్షిణాదిన కేరళలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆయా రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో అటవిని ఆనుకుని ఉన్న ప్రాంతాల ప్రజలు కొందరు తరతరాలుగా ఏనుగులను పెంచుకుంటున్నారు.సాధారణంగా పెంచుకునే ఏనుగులు మావటితో ప్రేమగా ఉంటాయి.
వారిని, వారి కుటుంబ సభ్యులతో ఇవి కూడా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఎవరూ దగ్గరకు వచ్చినా ఏమీ అనవు. వీటికి కూడా అంత కొంతో విశ్వాసం ఉంటుందని అంటుంటారు ఏనుగుల కాపరులు. అయితే, అటవీ ఏనుగులు ఒక్కోసారి బీభత్సం సృష్టిస్తుంటాయి. వాటిని చూసుకునే వారు ఎవరూ ఉండరు కావున ఎవరైనా దగ్గరకు వస్తే తొండంతో వారికి చీల్చి చెండాడుతాయి. పెంచుకునే ఏనుగులు మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాయి.
Viral Video : ఏనుగు తింటుండగా..
ఏనుగులకు ఆహారం అందించేందుకు లేదా దగ్గరకు వెళ్లేందుకు చిన్నారులు భయపడుతుంటారు. కానీ ఓ చిన్నారి మాత్రం తమ పెంపుడు ఏనుగు తింటుండగా నేరుగా దానికి పొట్ట భాగం కిందకు వెళ్లి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అస్సాంలోని గోలాఘాట్‌కి చెందిన హర్షిత- వారి పెంపుడు ఏనుగుల నుంచి పాలు తాగుతూ కనిపించగా.. నిస్వార్థమైన తల్లి-బిడ్డల అనుబంధంగా కనిపించింది. ఈ దృశ్యం ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Video of the weekend – has gone viral- A toddler- Harshita of Golaghat,Assam- is seen drinking milks from their domestic elephants.What a fabulous bonding of selfless mother-child like love. Lot to learn from humans. The incident has caught media attention.@ndtv reports pic.twitter.com/KgZnVT9OPG
— Ratnadip Choudhury (@RatnadipC) January 30, 2022