Virat Kohli : వరుస డకౌట్‌లు.. విరాట్ కోహ్లీపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
Virat Kohli : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నెలకొల్పిన రికార్డులు చెరిపేసే వారుంటారా అని ఒకప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. కాని ఆ రికార్డులని అవలీలగా చెరిపేశాడు విరాట్ కోహ్లీ. నేడు కెరీర్‌లోనే అత్యంత గడ్డు రోజులను చూస్తున్నాడు. ఐపీఎల్ 2022 కోహ్లీకి అస్సలు కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 41 పరుగులు చేసి శుభారంభం చేసిన కోహ్లీ.. ఆ తర్వాత వరుస వైఫల్యాలను అందుకున్నాడు. శనివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. మార్కోజాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
తద్వారా సీజన్‌లో రెండో గోల్డెన్ డక్ నమోదు చేసిన కోహ్లి.. ఓవరాల్‌గా ఐదుసార్లు గోల్డెన్ డక్ అయిన కోహ్లి.. మరో మూడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంకో విషయమేంటంటే.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజుగా మిగిలపోనున్న ఏప్రిల్ 23.. కోహ్లికి కూడా చేదు అనుభవాన్నే మిగిల్చనుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున(ఏప్రిల్ 23, 2017) కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డక్ అయ్యాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మరోసారి అదే రోజున కోహ్లి గోల్డెన్ డక్ కావడం యాదృశ్చికమనే చెప్పాలి. ఇక ఆ మ్యాచ్‌లో 49 పరుగులకే కుప్పకూలిన ఆర్‌సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును తమ పేరిట నమోదు చేసింది.
Virat Kohli : కోహ్లీ పరిస్థితి దారుణంగా మారింది..
ఒకప్పుడు ఐపీఎల్ అంటే విరాట్ కోహ్లి.. కోహ్లి అంటే ఐపీఎల్. అలా సాగేది అతడి విధ్వంసం. కానీ ఇప్పుడు విధ్వంసాలు, వీరత్వాలు పక్కనబెడితే కనీసం క్రీజులో నిలిచినా చాలు దేవుడా.. అని అతడి అభిమానులు ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు. కోహ్లి అభిమానులే కాదు.. తాను ఏం చేయలేకపోతున్నానే అనే భావన కోహ్లి ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ సీజన్ లో కోహ్లి ఇప్పటివరకు 8 మ్యాచులాడాడు. వాటిలో స్కోర్లు వరుసగా.. 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0 గా ఉన్నాయి.