Viral Video : సిగరెట్ల తో కాల్చుతూ భర్త ను చిత్ర హింసలు పెట్టిన భార్య … వైరల్ వీడియో…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : సిగరెట్ల తో కాల్చుతూ భర్త ను చిత్ర హింసలు పెట్టిన భార్య … వైరల్ వీడియో…!

Viral Video  : ఒకప్పుడు భర్త భార్యను కొట్టాడు అనే వార్తలు ఎక్కువగా వినే వాళ్ళం. కాని ప్రస్తుతం భార్యను భర్త కొట్టడం అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు భార్యలే భర్తలను కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 May 2024,12:00 pm

Viral Video  : ఒకప్పుడు భర్త భార్యను కొట్టాడు అనే వార్తలు ఎక్కువగా వినే వాళ్ళం. కాని ప్రస్తుతం భార్యను భర్త కొట్టడం అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు భార్యలే భర్తలను కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఓ మహిళ తన భర్తను కొట్టడం కాదు చిత్రహింసలు పెట్టడం మనం చూడవచ్చు. భర్త చేతులు కాళ్లు కట్టేసి సిగరెట్ తాగుతూ గుట్కా నములతూ భర్తపై విచక్షణా రహితంగా ఆమె చేసిన పని చూస్తే ఎవరైనా షాక్ అవాల్సిందే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఇదే ప్రాంతానికి చెందిన మన్నన్ మరియు మోహేర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే మోహేర్ కు సిగరెట్ మరియు మందు అలవాటు ఉండడంతో తన భర్త మన్నన్ ని బలవంతం చేసి సపరేట్ గా కాపురం పెట్టించింది. వేరే కాపురం పెట్టిన తర్వాత భార్య ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే భర్త మన్నన్ మొహేర్ ను చెడు అలవాట్లు మానుకోమని తన తల్లిదండ్రులతో కలిసి ఉందామని చెప్పుకొచ్చాడు. దీంతో భర్త మాటలు నచ్చని మోహెర్ అతడిని చిత్రహింసలు పెడుతూ వచ్చింది. ఇక ఈ విషయంపై మన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లు పట్టించుకోలేదు. రోజురోజుకు మొహెర్ ఆగడాలు మితిమీరడంతో మన్నన్ తన ఇంట్లో సీసీటీవీని కూడా అమర్చాడు. ఇదే సమయంలో ఓ రోజు మొహెర్ మన్నన్ తినే అన్నంలో మత్తుమందు కలిపి పెట్టింది.

Viral Video సిగరెట్ల తో కాల్చుతూ భర్త ను చిత్ర హింసలు పెట్టిన భార్య వైరల్ వీడియో

Viral Video : సిగరెట్ల తో కాల్చుతూ భర్త ను చిత్ర హింసలు పెట్టిన భార్య … వైరల్ వీడియో…!

ఆ తరువాత మన్నన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత అతడి చేతులను కాల్లను కట్టేసి సిగరెట్లతో ఎక్కడపడితే అక్కడ కాల్చింది. అంతేకాక మన్నన్ ప్రైవేట్ భాగాలను కత్తితో కోసేందుకు ప్రయత్నించగా మెలుకువలోకి వచ్చిన మన్నన్ ఆమె దగ్గర నుండి తప్పించుకుని పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు మన్నన్ ఇంటికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ను చూడగా పోలీసులు సైతం కంగుతున్నారు. ఇక ఈ వీడియోలో మొహెర్ చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే కలికాలం అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది