Warangal..ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ సక్సెస్‌ఫుల్..
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ శనివారం నిర్వహించారు. ఖిలా వరంగల్ పర్యాటక ప్రాంతం ఫోర్ట్ రోడ్ నుంచి ఖుష్ మహల్ వరకు రెండు కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, పోలీసులు, నగర ప్రజలు పాల్గొన్నారు. పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడతూ యూత్ ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామంతో పాటు ప్రతీ రోజు రన్నింగ్ చేయాలని సూచించారు. యూత్ ఫిట్ గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం కోసం ఆనాడు నాయకులు ఎంతో కష్టపడ్డారన్న విషయం యువత తెలుసుకోవాలని, స్వాతంత్ర ఉద్యమ నాయకుల త్యాగం ఫలితంగానే ప్రస్తుతం మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్న సంగతి గుర్తెరగాలని చెప్పారు. ఇకపోతే ఫ్రీడమ్ రన్‌లో యూత్ భారత జాతీయజెండాను ప్రదర్శించారు. ఆర్మీ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే.
youth participated in freedom india run