Warangal..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warangal..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,1:16 pm

విద్యారంగం, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో టీఎస్ యూటీఎఫ్ బుధవారం పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీ కృష్ణ, యాకూబ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేజీబీవీ, యూఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో డ్యూటీ చేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం విద్యా రంగం సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్‌మెంట్ మాదిరిగానే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాలనే డిమాండ్‌కు ముందర వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని అమలు చేయాలని చాలా కాలం నుంచి ఉద్యోగులు కోరుతున్నారు. ఇకపోతే కరోనా వల్ల ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి కూలీలుగా మారిన పరిస్థితులను మనం చూడొచ్చు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది