Warangal..కాకతీయ మెగా టెక్స్‌టైల్ పరిశ్రమలో పర్యటించిన ఎమ్మెల్యే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warangal..కాకతీయ మెగా టెక్స్‌టైల్ పరిశ్రమలో పర్యటించిన ఎమ్మెల్యే

 Authored By praveen | The Telugu News | Updated on :10 September 2021,10:22 pm

జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

Also read

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది