Warangal..కాపులకనపర్తి వద్ద వరద ఉధృతి పరిశీలించిన కలెక్టర్
వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కాపులకనపర్తిలో లెవల్ కాజ్ వే వద్ద వరద ఉధృతిని మంగళవారం జిల్లా కలెక్టర్ గోపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు. ఇక జిల్లావ్యాప్తంగా భారీ వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అధికారులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం […]
వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కాపులకనపర్తిలో లెవల్ కాజ్ వే వద్ద వరద ఉధృతిని మంగళవారం జిల్లా కలెక్టర్ గోపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు. ఇక జిల్లావ్యాప్తంగా భారీ వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అధికారులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే అక్కడి జనాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చొరవ చూపిస్తున్నారు.