Guntoor.. ‘పొలంబాట’లో ఎమ్మెల్యే.. రైతులతో సమావేశం

Authored By praveen T | The Telugu News | Updated on: September 4, 2021, 4:19 pm

గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ‘పొలంబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కొల్లిపర గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ క్రమంలోనే రైతులతో ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా సమావేశమయ్యారు. వ్యవసాయం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు.

ఎటువంటి పంటలు పండిస్తున్నారు., ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది అని తదితర విషయాలు రైతుల నుంచి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. కొల్లిపర గ్రామంలోని పసుపు పంట, పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పసుపు పంట దిగుబడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంట స్థానిక వైసీపీ నేతలు, అధికారులు ఉన్నారు. ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొల్లిపర గ్రామ రైతాంగం తమ సమస్యల గురించి ఎమ్మెల్యేకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం తమ ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు.

praveen T

No bio available for this author.

  1. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  2. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  3. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  4. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  5. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  6. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  7. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp