ఏపీ పోలీసు శాఖకు 5 జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అత్యుత్తమంగా పని చేస్తున్నదని ఆ రాష్ట్ర డీజీపీ గౌత్ సవాంత్ తెలిపారు. ఏపీ పోలీసు శాఖకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు రావడం పట్ల డీజీపీ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రమారవం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు ఐదు అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ అవార్డుల ద్వారా ఏపీ పోలీసుల పని తీరు మరింత మెరుగవుతున్నదని తెలుసుకోవచ్చన్నారు. ఏపీ పోలీసులు గర్వించే రోజని పేర్కొన్నారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అత్యుత్తమంగా పని చేస్తున్నదని ఆ రాష్ట్ర డీజీపీ గౌత్ సవాంత్ తెలిపారు. ఏపీ పోలీసు శాఖకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు రావడం పట్ల డీజీపీ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రమారవం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు ఐదు అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ అవార్డుల ద్వారా ఏపీ పోలీసుల పని తీరు మరింత మెరుగవుతున్నదని తెలుసుకోవచ్చన్నారు. ఏపీ పోలీసులు గర్వించే రోజని పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని, ఇందుకుగానూ అవార్డు దక్కిందని డీజీపీ వివరించారు.
ఇకపోతే పాస్‌పోర్ట్ సేవలోనూ దేశంలోనే ఏపీ స్టేట్ అగ్రస్థానంలో ఉందని, పాస్‌పార్ట్ వెరిఫికేషన్ టెక్నాలజీ సాయంతో చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం జాతీయ స్ధాయిలో ఏపీ పోలీసు శాఖను మొదటి స్థానంలో ఉంచిందని చెప్పారు. ‘దిశ’ యాప్, మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయని తెలిపిన డీజీపీ, గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు పోలీసు శాఖకు 130 అవార్డులు దక్కాయని వివరించారు. ఎవ్రీ మండేస్‌లో అన్నిజిల్లాల ఎస్పీ కార్యాలయాలలో ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 38 వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు.