Guntooru..నిరుద్యోగులకు శుభవార్త.. డీఎంహెచ్‌వో ఆఫీసులో ఉద్యోగాలు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో 86 మెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఈ మెడికల్ పోస్టుల భర్తీ జరగనుంది. ఖాళీల వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య 86 కాగా, ఇందులో సైకియాట్రిస్ట్స్–02, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజీషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–27, స్టాఫ్ నర్సులు–35, సైకియాట్రిక్ నర్స్–05, ఫిజియోథెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్–03, సోషల్ వర్కర్–04, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వేతనం పోస్టుల్ని అనుసరించి ఉండగా, అర్హత కూడా పోస్టుల్ని అనుసరించి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపిక అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. అయితే, అప్లికేషన్స్ ఆఫ్ లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ను గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం గుంటూరు అడ్రస్‌కు పంపాలి. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని కానీ, అధికారిక వెబ్ సైట్‌ను కానీ సంప్రదించొచ్చు.