kadapa.. ఏపీఐఐసీ డైరెక్టర్‌గా వేంపల్లెవాసి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kadapa.. ఏపీఐఐసీ డైరెక్టర్‌గా వేంపల్లెవాసి

 Authored By praveen | The Telugu News | Updated on :4 September 2021,4:05 pm

కడప జిల్లాలోని వేంపల్లె వైసీపీ మండల కన్వీనర్‌ చంద్రఓబుల్‌రెడ్డి ఏపీఐఐసీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దాంతో వేంపల్లెలో ఆనంద వాతావరణం నెలకొంది. మండల స్థాయి నేతకు కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడం గొప్ప విషయమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు, చంద్రఓబుల్ రెడ్డి అనుయూయులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇకపోతే చంద్రఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ తనకు డైరెక్టర్‌గా పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, కడం ఎంపీ అవినాష్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఏపీ సర్కారు నియమించింది. దాంతో రాష్ట్రంలో కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడే చాన్సెస్ ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్స్‌కు డైరెక్టర్ల నియామకంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చినట్లు కనబడుతున్నది. అయితే, కొందరు వైసీపీ నేతలు తమకు డైరెక్టర్ పదవి ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది