Guntoor.. మహనీయురాలు మదర్ థెరిస్సా

Authored By praveen T | The Telugu News | Published on: September 5, 2021, 7:29 pm

జిల్లాలోని నరసరావుపేటలో నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో భారతరత్న మదర్ థెరిస్సా వర్ధంతి సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభలో చిరంజీవి యువత సభ్యులు మాట్లాడుతూ మదర్ థెరిస్సా మహనీయురాలని కొనియాడారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవకు మరో పేరు మదర్ థెరిస్సా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నరసరావుపేట అధ్యక్షులు అద్దేపల్లి ఆనంద్, ఆర్కే యాదవ్, శ్రీకాంత్, జయరాం తదితరులు పాల్గొన్నారు.

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగానూ మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మదర్ థెరిస్సా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా చిరంజీవి యువత సభ్యులు తెలిపారు. సేవా దృక్పథంతోనే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్లు గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే.

 

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp