Adilabad..స్వర్ణ జలాశయాన్ని సందర్శించిన కలెక్టర్
భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటున్నది. వాగులు, వంకలు నీటితో పొర్లిపోతున్నవి. జిల్లాలోని సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి వరద నీరు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వర్ణ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో జలాశయ నీటి మట్టం గురించి, వదులుతున్న […]
భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటున్నది. వాగులు, వంకలు నీటితో పొర్లిపోతున్నవి. జిల్లాలోని సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి వరద నీరు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వర్ణ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడేతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో జలాశయ నీటి మట్టం గురించి, వదులుతున్న నీటి గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాక ముందరే ఆ ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని తెలిపారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇకపోతే జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.