Adilabad..ప్రజా సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రాథోడ్

0
Advertisement

తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయమని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన పలువురికి ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదన్నారు. ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను సర్కారు ఆదుకుంటున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తూ దళిత జాతికి భరోసా ఇస్తున్నదని వివరించారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement