Adilabad..విషాదం..పిడుగు పడి ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

Advertisement

సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్‌ బ్రిడ్జ్‌పై వానలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. బైక్‌పై ఓ వ్యక్తి తన భార్య, కొడుకును తీసుకెళ్తుండగా పిడుగు పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ నడుపుతున్న సదరు వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఘటన జరిగిన వెంటనే గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Advertisement

భారీ వర్షం నేపథ్యంలో బైక్‌పై ఉన్న వారిపై పిడుగు పడిన సంగతిని కొద్ది సేపటి వరకు ఎవరూ గమనించనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పలువురు అంటున్నారు.

Advertisement
Advertisement