Nara Lokesh : కూటమిలో కీలక మలుపు.. నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా..?
ప్రధానాంశాలు:
Nara Lokesh : కూటమిలో కీలక మలుపు.. నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా..?
Nara Lokesh : ప్రజల్లో బలమైన పునాదులు ఉన్న పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన సూపర్ విజన్ చేస్తూ కొత్త తరానికి బాధ్యతలు అందించాల్సిన సమయం వచ్చింది. నారా లోకేష్ సమర్థమైన లీడర్‌నేనని.. పార్టీని నడిపించగలనని నిరూపించారు. పాదయాత్ర చేశారు. పార్టీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. ఒక్క నారా లోకేష్ మాత్రమే కాదు..సడెన్ గా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పరిటాల శ్రీరామ్ వరకూ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ టీడీపీకి బలమైన యువ నాయకత్వం ఉంది.

Nara Lokesh : కూటమిలో కీలక మలుపు.. నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా..?
Nara Lokesh యువతరానికి ఛాన్స్..
వారందరికీ అదనపు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును నారా లోకేష్ కు ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా ఉంది. నారా లోకేష్ అటు ఢిల్లీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
ఇప్పుడు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేస్తే టీడీపీని నడిపించే తర్వాత తరం ప్రతి జిల్లాలోనూ బలంగా తయారవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ క్యాడర్ మహానాడులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ కొత్త తరంలోకి టీడీపీని తీసుకెళ్లే మహానాడుగా.. కడప మహానాడు చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. కాగా కొద్ది రోజుల క్రితం లోకేష్‌కి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.