Farmers : రైతుల‌కి శుభ‌వార్త చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. రూ.20వేల జ‌మ ఎప్పుడంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతుల‌కి శుభ‌వార్త చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. రూ.20వేల జ‌మ ఎప్పుడంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతుల‌కి శుభ‌వార్త చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. రూ.20వేల జ‌మ ఎప్పుడంటే..!

Farmers  : రైతుల‌కి Formers మంచి రోజులు వ‌చ్చాయి. వారి బాధలు అర్ధం చేసుకున్న కూట‌మి ప్ర‌భుత్వం వారికి అండ‌గా నిలిచేందుకు సిద్ధ‌మైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు Chandrababu naidu రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు.అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6,000తో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు అందించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

farmers రైతుల‌కి శుభ‌వార్త చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం రూ20వేల జ‌మ ఎప్పుడంటే

farmers : రైతుల‌కి శుభ‌వార్త చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. రూ.20వేల జ‌మ ఎప్పుడంటే..!

Farmers  మంచి నిర్ణ‌యం..

రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.రైతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చంద్ర‌బాబు Chandra babu naidu హామీ ఇచ్చారు.

కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు.అన్నదాత సుఖీభవ annadata sukhibhava అమలుతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అలానే మత్స్యకారులకు కూడా రూ.20,000 అందజేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పింఛన్ల రూపంలో ఏటా రూ.34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న రాష్ట్రమేనంటూ చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది