AP Politics : సీఎంగా పవన్, డిప్యూటీ సీఎంగా లోకేష్.. ఏపీలో హాట్ టాఫిక్..!
ప్రధానాంశాలు:
మార్చిలో ఏపీ మంత్రవర్గ విస్తరణ.. సీఎంగా పవన్, డిప్యూటీ సీఎంగా లోకేష్ !
AP Politics : Andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ TDP నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Chandrababu Naidu తన కుమారుడు మరియు మంత్రి నారా లోకేష్‌ను Nara Lokesh ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించాలని TDP టీడీపీలోని నాయకులు సూచించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. జనవరి 18న వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరులో ముఖ్యమంత్రి ప్రసంగించిన సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఈ డిమాండ్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు SR Ntr వర్ధంతిని పురస్కరించుకుని ఈ సమావేశం నిర్వహించబడింది.
AP Politics డిప్యూటీ సీఎంగా లోకేష్ కావాలి
పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండేలా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ రెడ్డి Srinivas Reddy చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు. “మాకు ఒక కోరిక ఉంది. TDP టీడీపీ ఏర్పడి 43 సంవత్సరాలు అయింది. మూడవ తరం నాయకుడు నారా లోకేష్ పార్టీలోకి వచ్చారు. యువతకు మరియు పార్టీకి విశ్వాసం కలిగించడానికి లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలని తాము కోరుకుంటున్నాము, ”అని ఆయన అన్నారు, ఇది పార్టీకి మంచి భవిష్యత్తును ఇస్తుందన్నారు. గతంలో మరో టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్ పార్టీ మరియు ప్రభుత్వ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? అంటే అవును అనే చర్చ సర్వత్రా నడుస్తుంది. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుండి బలంగా వినిపిస్తుంది. ఈ విషయంపై ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ అంశంపై ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వార్‌లు జరుగుతున్నాయి. నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే, పవన్ కళ్యాణ్ Pawan Kalyan ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియా లో Janasena Party జనసేన పార్టీ అభిమానులు గట్టిగ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ కి అధినేత, ఆయనకి ప్రత్యేకంగా 21 సీట్లు ఉన్నాయి. ఆయన కారణంగానే కూటమి 17 శాతం మార్జిన్ తో ఘన విజయం సాధించింది. అలాంటి వ్యక్తికీ సముచిత స్థానం, గుర్తింపు లభించాలని డిమాండ్లు లేవనెత్తారు.
లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని నిన్న మొన్నటి వరకు కేవలం మీడియా, Social Media సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు ఆ పార్టీ నాయకులు రిక్వెస్ట్ చేసే వరకు వెళ్లింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పవర్ సెంటర్ గా మారిపోతుండడంతో, నారా లోకేష్ ని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆయన స్థాయి పెరిగేలా ఉప ముఖ్యమంత్రి హోదాని ఇవ్వాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మార్చి నెలలో పవన్ కళ్యాణ్ అన్న Nagababu నాగబాబు మంత్రి వర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సమయంలో మంత్రి వర్గ కూర్పులో మార్పులు జరగొచ్చు అంటున్నారు. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.