Chiranjeevi : చిరంజీవి వీడియో పై స్పందించిన కొడాలి నాని… నువ్వు నీ పకోడీ మాటలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chiranjeevi : చిరంజీవి వీడియో పై స్పందించిన కొడాలి నాని… నువ్వు నీ పకోడీ మాటలు…!

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కోసం రాజకీయ ప్రచారాలలో పాల్గొంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వీడియోని షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా చిరంజీవి […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 May 2024,11:00 am

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కోసం రాజకీయ ప్రచారాలలో పాల్గొంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వీడియోని షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ అనేవాడు అమ్మ గర్భం నుండి చివరిగా బయటకు వచ్చినప్పటికీ అందరికీ సహాయం చేయాలనే తత్వంలో ముందు ఉంటాడు. నా తమ్ముడు కళ్యాణ్ బాబుది తన తన గురించి కంటే ప్రజల మంచి గురించి ఆలోచించే తత్వం…

ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకుండానే తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుపెట్టడం , సరిహద్దుల వద్ద ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే జవాన్లకు అందించడం, అలాగే మత్స్యకారులు ఇలా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాలోకి తాను బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి మాత్రం చాలా ఇష్టంగా వచ్చాడని జీరంజీవి తెలియజేశారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ళ వలనే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతుందని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తి శాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభల్లో పవన్ గొంతును మనం వినాలని , అది జరగాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి అందరికీి తెలిసిందే.

Chiranjeevi చిరంజీవి వీడియో పై స్పందించిన కొడాలి నాని నువ్వు నీ పకోడీ మాటలు

Chiranjeevi : చిరంజీవి వీడియో పై స్పందించిన కొడాలి నాని… నువ్వు నీ పకోడీ మాటలు…!

Chiranjeevi : కొడాలి నాని కౌంటర్…

అయితే చిరంజీవి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ…సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు పకోడీగాలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని అసలు మాట్లాడవద్దని చెబితే బాగుంటుందంటూ కొడాలి నాని తెలిపారు. మనకెందుకురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డాన్సులు , ఫైట్లు మన పని మనం చూసుకుందామని వాళ్లకి కూడా సలహా ఇస్తే బాగుంటుంది అంటూ తెలిపారు.మాకు అడ్డమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీంతో ప్రస్తుతం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది