Pawan kalyan : పిఠాపురంలో ప్రచారంలో వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ంగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Pawan kalyan : పిఠాపురంలో ప్రచారంలో వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ంగ్ కామెంట్స్..!
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే…జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి ముందుకు వెళుతున్నాయి. అయితే ఎన్నికల డేట్ దగ్గర పడుతుండటంతో నామినేషన్ ప్రక్రియను ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు.
Pawan kalyan : రాబోయే ఎన్నికలు ఎంతో కీలకం…
గత ఐదు సంవత్సరాలుగా నీచపు పరిపాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని, గద్దె దించే సమయం వచ్చిందని దానిలో భాగంగానే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ నామినేషన్ కు వచ్చే దారి మధ్యలో దాదాపు 60 నుంచి 70 వేలమంది ప్రజల ఆశీర్వచనాలతో ఇక్కడికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు 2047 వచ్చే తరానికి ఎంతో కీలకమైనవని ఆయన అన్నారు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తా ఉన్నాయి. జనసేన పార్టీ కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి వచ్చిందని తెలిపారు. చాలా నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు వారి సీట్లను మిస్ చేసుకున్నారు. అలా త్యాగాలు చేసిన వారిలో ముఖ్యమైన బలమైన నాయకులు వర్మ గారు. వర్మ గారు నాకోసం తన సీట్ ను త్యాగం చేశారని వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Pawan kalyan : పిఠాపురంలో ప్రచారంలో వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ంగ్ కామెంట్స్..!
జనసేన పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలను దాటి త్యాగాలు చేస్తున్నారని వారందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని దానికి నిదర్శనమే ఇప్పుడు నామినేషన్ వేసే ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మాకు అండగా నిలబడిన మీడియా మిత్రులు అందరికీ మేము ఖచ్చితంగా అండగా ఉంటామని మీ కష్టాలలో పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.