Janasena – TDP : జనసేన – టీడీపీ ప్లానింగ్ మొత్తం బయటపెట్టిన సజ్జల – ఇది మిస్ అవ్వకూడని న్యూస్ !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: July 17, 2023, 9:15 pm

Janasena – TDP : ఏపీలో ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. రెండోసారి కూడా గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఇప్పుడిప్పుడే వైసీపీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే విజయసాయిరెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. అలాగే.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రంగంలోకి దిగారు. వైసీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో వాళ్లకు పలు కీలక సూచనలు చేశారు సజ్జల.

వచ్చే ఎన్నికల్లో ఏదో గెలిచాం అంటే గెలిచాం అని కాకుండా 175 స్థానాలకు 175 గెలుచుకోవాలని సూచించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా మిస్ కావొద్దని.. దాని కోసం తీవ్రంగా కష్టపడాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిపక్ష పార్టీకి ఒక్క సీటు కూడా వెళ్లొద్దని.. వాళ్లకు అస్సలే అవకాశం ఇవ్వొద్దన్నారు. అలాగే.. ఓటర్ జాబితా విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల.

sajjala-rama-krishna-reddy-tele-conference-with-ycp-leaders

sajjala-rama-krishna-reddy-tele-conference-with-ycp-leaders

Janasena – TDP : వాలంటీర్ల వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్న సజ్జల

అలాగే.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాయని.. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సజ్జల.. వైసీపీ నేతలకు సూచించారు. వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికర్స్ అనే ముద్ర వేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. వాలంటీర్ల వల్ల ఏపీలోని ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతోంది కానీ.. నష్టం కలగడం లేదు. కానీ.. వాలంటీర్లపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క వైసీపీ నేత తిప్పి కొట్టాలని సజ్జల స్పష్టం చేశారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  2. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  3. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  4. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  5. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  6. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  7. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp