TDP : షర్మిల కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : షర్మిల కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 March 2025,4:20 pm

ప్రధానాంశాలు:

  •  TDP : షర్మిల కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ..!

TDP  : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినప్పటికీ, ఇది జిల్లాల మధ్య కాకుండా ఒక్కో జిల్లాలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందించబోతున్నట్లు చెప్పినా, ఇప్పుడు జిల్లా స్థాయిలోనే పరిమితం చేయడం విపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించే స్వేచ్ఛ లేకపోవడంతో, ఈ నిర్ణయంపై ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణం అనేది నిజమైన సౌకర్యమా, లేక కేవలం ఓట్ల కోసం ఇచ్చిన హామీ మాత్రమేనా? అనే ప్రశ్నలు రాజకీయం వేడెక్కిస్తున్నాయి.

TDP షర్మిల కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ

TDP : షర్మిల కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన టీడీపీ..!

TDP  షర్మిల ఈ సాక్ష్యం చాల.. ఇంకా కావాలా..? – టీడీపీ

ఈ అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. “ఎన్నికల ముందు ఉచిత ప్రయాణం అంటూ ప్రజలను విశ్వాసంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం, ఇప్పుడు కొత్త షరతులు విధించడం ప్రజలను మోసం చేసినట్లే” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. ముఖ్యంగా “ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా, దాటాక బోడి మల్లన్నా” అనే సామెతను ఉదహరిస్తూ, ప్రభుత్వం తీరును ఖండించారు. ముందు ఉచితం అని చెప్పి, ఇప్పుడు పరిమితులు విధించడం తప్పుడు పాలనకు నిదర్శనమని విమర్శించారు. భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలోనే ఉచిత ప్రయాణం అనే నిబంధన కూడా విధిస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సానుకూలంగా స్పందించింది. ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, ఒకే జిల్లాలో ఎక్కడినుంచైనా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. పైగా ఈ హామీ ఎన్నికల ప్రచార వీడియోలు ద్వారా ప్రజలకు మరోసారి వివరించింది. జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించింది. ప్రజలకు మేలు జరిగితే ఓర్వలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), ఉచిత ప్రయాణ పథకాన్ని తప్పుబడుతూ అవాస్తవ ప్రచారం చేస్తోందని టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీంతో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజకీయం వేడెక్కించింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది