TDP : టీడీపీ దెబ్బకి గ్లాస్ ఎగిరిపోయింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీ దెబ్బకి గ్లాస్ ఎగిరిపోయింది !

 Authored By sekhar | The Telugu News | Updated on :24 May 2023,12:00 pm

TDP : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటినుండే తీవ్రంగా శ్రమిస్తోంది. చంద్రబాబుకి వయసు మీద పడటంతో లోకేష్ నీ ముఖ్యమంత్రి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా పరవాలేదు అన్న రీతిలో పార్టీకి మైలేజ్ తీసుకొస్తూ ఉంది. మరోపక్క చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో కచ్చితంగా పొత్తులతోనే ముందుకెళ్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

అయితే పొత్తుల మాయలో పడి టీడీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుదామని అనుకున్న జనసేనకి ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. మేటర్ లోకి వెళ్తే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది. జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తుని కేటాయించాలని పవన్ ఎంత రిక్వెస్ట్ చేసుకున్న… ప్రయత్నాలు ఫలించలేదు. కమిషన్ నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గాజు గ్లాసు దక్కాలంటే…ఎలక్షన్ లో మొత్తం మీద ఏడు శాతం ఓట్లు గాని లేదా కనీసం రెండు అసెంబ్లీ సీట్లలో గెలవాల్సి ఉండాలి. 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి 5.53 ఓట్లు శాతమే వచ్చాయి. ఇదే సమయంలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలవడంతో…

జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ పూర్తిగా దక్కించులేకపోయింది. ఆ తర్వాత మూడు ఉప ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన జనసేన పార్టీ పోటీ చేయలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జనసేన అన్నిచోట్ల పోటీ చేయలేదు. చాలా వరకు తెలుగుదేశం పార్టీ మాయలో పడి జనసేన… లోపాయికారి రాజకీయాలతో… ఎన్నికల గుర్తు పోగొట్టుకున్నట్లు పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా చూసుకుంటే 60 సార్లకు పైగా మాత్రమే రావడం జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ వచ్చినట్లు టాక్. సో టిడిపి దెబ్బకి చివరకి జనసేన గాజు గ్లాస్ ఎగిరిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది