Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి తర్వాత ఎవరు…? ఆ ఇద్దరి మీదే దృష్టి…?
Pinnelli Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం నేతలను పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసిన కొందరు నేతలు, అధికారుల మీద టీడీపీ అగ్ర నేతలు దృష్టి పెట్టి వాళ్ళ అక్రమాలు బయటకు తీసీ లోపల వేయించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన బెయిల్ ను హైకోర్ట్ తిరస్కరించడంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేసారు.
ఇక పిన్నెల్లి తర్వాత మరి ఎవరు అనే దానిపైనే చర్చ అంతా నడుస్తోంది. మాజీ మంత్రులు కొడాలి నానీ, ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యేలు తోపదుర్తి ప్రకాష్ రెడ్డి, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరి పేర్లు వినపడుతున్నాయి. వీరి అక్రమాల మీద దృష్టి పెట్టిన కీలక నేతలు కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఒక్కొక్కరిగా జైల్లో వేస్తారని చర్చ నడుస్తోంది.
కొందరు మాజీ ఎంపీల మీద కూడా దృష్టి పెట్టారని సమాచారం. రెడ్ బుక్ లో వీరు అందరి పేర్లు ఉన్నాయని త్వరలోనే కీలక పరిణామాలు ఉండవచ్చని అంటున్నారు. కొన్ని చోట్ల భూ కబ్జాలు, గంజాయి వ్యవహారాల మీద ప్రధానంగా దృష్టి సారించారని సమాచారం. పిన్నెల్లి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల్లో కలవరం మొదలైందని అంటున్నారు.