Vijayasai Reddy : శభాష్ విజయసాయి రెడ్డి… పార్లమెంట్ లో ప్రతీ ఒక్కరూ మెచ్చుకున పని చేసిన వైసీపీ ఎంపీ
Vijayasai Reddy : ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యసభలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 5వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈసందర్భంగా మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ నేతృత్వంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా తమ మద్దతు ఉంటుందని.. ఏపీలో తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తోందని.. అలాగే దేశమంతా గిరిజనుల మేలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా వాళ్లకు వైసీపీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు.
అయితే.. టీడీపీ సభ్యులు రాజ్యసభలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను వైసీపీ ఎంపీ తిప్పికొట్టారు. జగన్ ఏపీలో సీఎంగా అధికారం చేపట్టాక గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజనులు ఉండే ప్రాంతంలో నెలకొల్పేందుకు సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. దాని కోసం ప్రధాని మోదీనే జగన్ ఒప్పించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కావాల్సిన వందలాది ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం సమకూర్చిందని.. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం కూడా ప్రారంభం అయిందని స్పష్టం చేశారు.
Vijayasai Reddy : గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వందలాది ఎకరాలను సమకూర్చిన ప్రభుత్వం
అలాగే.. పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. పోడు వ్యవసాయమే చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి అప్పట్లో వైఎస్సార్ శ్రీకారం చుట్టగా.. దాన్ని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పున:ప్రారంభించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.