Business Idea : ఈ బిజినెస్ లో తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయం పొందవచ్చు..
Business Idea : కరోనా వచ్చాక చాలామంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. అయితే కొంతమంది చిన్నచిన్న ఉద్యోగాలను చేస్తూ కాలం గడుపుతున్నారు. మరికొందరు సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటివారు ఈ వ్యాపారాన్ని కనుక చేశారంటే మంచి ఆదాయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆన్లైన్ సేవలకు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రజలు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని సరుకులు, పండ్లు తదితర పదార్థాలను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కరోనా కంటే ముందే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాయి. అయితే ఆన్లైన్లో టిఫిన్ కి మాత్రం అనుకున్నంతగా ఆర్డర్లు రావడం లేదు. దీనికి కారణం, నిజానికి బయట టిఫిన్ ధర తక్కువ ఉంటుంది.
ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేస్తే సర్వీస్ చార్జెస్ కలిపి మొత్తం ధర అధికమవుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు టిఫిన్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్లో టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం మంచి ఐడియా అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ ను మీరు ఇంటి వద్ద నుండే ప్రారంభించవచ్చు. కేవలం ఐదు నుంచి పదివేల పెట్టుబడి తో ఈ బిజినెస్ను మొదలు పెట్టవచ్చు. కాకపోతే ఈ వ్యాపారానికి మీరు పబ్లిసిటీ చేయడం అవసరం. ఆర్డర్లు, యూపీఐ ద్వారా బిల్లు తీసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ కోసం మంచి వంట మాస్టర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు బైక్ ఉంటే మీరు డెలివరీ చేయొచ్చు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ డెలివరీ చేయడానికి బాయ్స్ ను నియమించుకోవచ్చు.
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసేవారు, కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రావటానికి ఇష్టపడని వారు ఈ వ్యాపారం ద్వారా సేవలు అందించవచ్చు. ఇంకా బ్యాచులర్స్ సైతం ఈ సేవలు పొందేటందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు మంచి క్వాలిటీతో సేవలు అందిస్తే మీ వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయవచ్చు. వ్యాపారం బాగా సాగితే రోజుకు రూ.2000 చొప్పున నెలకు రూ.60,000 వరకు సంపాదించవచ్చు. ఇంట్లోని స్త్రీలు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించవచ్చు. కస్టమర్లను ఇంప్రెస్ చేయగలిగితే మీకు లక్షలు ఖర్చుపెట్టి దొరకని మంచి పబ్లిసిటీ వస్తుంది.