Business : దేశ రాజధాని ఢిల్లీలో బుల్లెట్ పై ఇంజనీరింగ్ అమ్మాయి పానీపూరి వ్యాపారం.. వీడియో
Business : ప్రస్తుత రోజుల్లో చదువుకుంటున్న చదువుకు చేస్తున్న ఉద్యోగాలకు అస్సలు సంబంధాలు ఉండటం లేదు. డిగ్రీలు ఎక్కువైపోయి బయట ఉపాధి దొరకక చాలామంది నిరుద్యోగ యువత వయసు మీద పడిపోయి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ పుణ్యమా కొంతమంది ఇంటిలోనే ఉంటూ సంపాదిస్తూ ఉన్నారు. కాగా ఒకప్పుడు బీటెక్ చదివితే కచ్చితంగా ఉద్యోగం గ్యారెంటీ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటూ..
అటు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రాక మరోపక్క వేరే పని చేయలేక అయోమయానికి గురవుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీలో 21 ఏళ్ల తాప్సి ఉపాధ్యాయ అనే అమ్మాయి బీటెక్ చదవడం జరిగింది. అయితే బీటెక్ చదివిన వెంటనే 21 సంవత్సరాలకు వయసు కలిగిన తాప్సి చాలా వెరైటీగా ఆలోచించి చిన్న ఆలోచనతో అద్భుతమైన వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. మేటర్ లోకి వెళ్తే ఉత్తరాదిలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది పానీపూరి అని అందరికీ తెలుసు. దీంతో తాప్సీ ప్రజల ఆహార అభివృద్ధిని బాగా కనిపెట్టి…
బుల్లెట్ బండి ద్వారా పానీపూరి చిన్న బండి కలిపి అక్కడ విక్రయిస్తున్నారు. బీటెక్ పాప పానీపూరి బండి ఢిల్లీలో చాలా వైరల్ గా మారింది. ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత తాప్సి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారం ప్రారంభించినట్లు తాప్సి చెప్పుకొస్తున్నారు. అతి చిన్న వయసులోనే అది కూడా ఉన్నత విద్య చదివి చాలా వెరైటీగా తాప్సి పెట్టిన ఈ బుల్లెట్ పానీపూరి బండి ఢిల్లీలో బాగా క్లిక్ అయింది.