Sankranti Festival : సంక్రాంతి చరిత్ర ఏమిటి.? అసలు ఎలా మొదలైందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sankranti Festival : సంక్రాంతి చరిత్ర ఏమిటి.? అసలు ఎలా మొదలైందో తెలుసా..?

Sankranti Festival : సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు గోబ్బమలకు హరిదాసు పాటలకు బసవన్న ఆటలకు ,నువ్వుల మిఠాయిలకు, గాలిపటం మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పంటల పండుగ అని మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు. అలాగే ఈ పండుగను పెద్ద పండుగ అని పెద్దల పండుగ అని కూడా అంటారు అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అంత సమయం […]

 Authored By jyothi | The Telugu News | Updated on :15 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Sankranti Festival : సంక్రాంతి చరిత్ర ఏమిటి.? అసలు ఎలా మొదలైందో తెలుసా..?

Sankranti Festival : సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు గోబ్బమలకు హరిదాసు పాటలకు బసవన్న ఆటలకు ,నువ్వుల మిఠాయిలకు, గాలిపటం మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పంటల పండుగ అని మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు. అలాగే ఈ పండుగను పెద్ద పండుగ అని పెద్దల పండుగ అని కూడా అంటారు అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అంత సమయం లేక మూడు రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు. అసలు ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు.? ఈ పండుగ విశిష్టత.. గొప్పతనం ఏమిటి తెలుసుకుందాం.. సంక్రాంతి ఇది కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా అనగా.. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులుగా అంటే నాలుగో రోజు ముక్క కనుమగా జరుపుకుంటారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమము.. అంటే సూర్యుడు మేశాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూరవ్య నుంచి ఉత్తర రాశులకు ప్రవేశించడమే ఈ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతినే పంట కోతల లేదా పంట మార్పిడిలో పండుగ కూడా పిలుస్తారు.. సాధారణంగా సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి.

భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. ఇక పౌరాణికంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గురపాటం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు రెండవ రోజు సంక్రాంతి పండుగ గోగులు పూచే గూగుల్ గీతాలతో కేరింతలు వినిపించి తెలుగు వారి రెండో రోజు పండగే సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్ళల్లో ఉన్న పంటలు చూసుకొని రైతులు మురిసిపోతుంటారు. అంతేకాకుండా ఈరోజున పితృ దేవతలకు తర్పణాలు వదులుతారు.. ఇంటి ముందు వేసే ముగ్గులు చివర రోజు రథం ముగ్గు వేస్తారు. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పుడితే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభనను పెంచుతాయి. ఈ కాలంలోనే అంటే హేమంత్ ఋతువులు గొబ్బి పువ్వులు అంటే డిసెంబర్ పువ్వులు చామంతులు, బంతిపూలు, ఎక్కువగా పూస్తాయి. సంక్రాంతికి చూసిన మామిడి తోరణాలు కాకుండా బంతిపూల తోరణాలు కనపడతాయి. ఇక సంక్రాంతికి దాదాపుగా అందరూ ఇళ్లల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకనాలు, పాలతాకలు, సేమియా, పాశం, పరమాన్నం, పులిహార, గారెలు ఇలా రకరకాల వంటకాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఈ పండుగను అందరూ ఆనందంగా ఆహ్వానిస్తారు.

ఇక ఇప్పుడు ఫైనల్ గా నెంబర్ 3వ రోజు కనుమ పండుగ కనుమ పండుగను మూడో రోజు జరుపుకుంటారు.కనుమ అంటే పశువు అని అర్థం. గ్రామంలోని పసువులను శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి నుదిట బొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇక దివ్య సీమ సంప్రదాయ పడవ పోటీలు లాంటి ప్రదర్శనలు, డ్రాగన్ పోర్ట్ డేస్ లో అన్ని నిర్వహిస్తారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. ఇక సంక్రాంతి టైంలో మరొక ప్రత్యేకమైన అంశం సినిమాలు విడుదల చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి టైం కి హీరోలు తమ సినిమా విడుదల చేసుకుంటారు. పెద్దపెద్ద హీరోలు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగుతారు. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సంప్రదాయాలు కనుగొనంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు.బోగి భాగ్యాలను.. సరదాకి సంక్రాంతి.. కమ్మని కనుమ ఇలా ఈ మూడు పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటనన్నాము…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది