Maha Shivratri : మహా శివరాత్రి నుంచి ఈ రాశుల తల రాత మారబోతుంది…!
ప్రధానాంశాలు:
Maha Shivratri : మహా శివరాత్రి నుంచి ఈ రాశుల తల రాత మారబోతుంది...!
Maha Shivratri : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి zodiac signs నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇలా సంచరించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. ఇక అవి వాటి చక్ర గుర్తు లకు శుభ మరియు అశుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వచ్చింది. ఇక ఆ రోజున శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అంతేకాకుండా ఈరోజున రుద్రుడు శివతాండవం చేసిన రోజుగా కూడా చెబుతారు. మహాశివరాత్రి నుంచి ఐదు రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశిలో వారికి కలిసి వస్తుందని విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
![Maha Shivratri మహా శివరాత్రి నుంచి ఈ రాశుల తల రాత మారబోతుంది](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Maha-Shivratri.jpg)
Maha Shivratri : మహా శివరాత్రి నుంచి ఈ రాశుల తల రాత మారబోతుంది…!
Maha Shivratri సింహరాశి
సింహరాశి జాతకులకు మహాశివరాత్రి తర్వాత నుండి ఆర్థికంగా బలపడతారు. అలాగే అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఆర్థికంగా అడ్డంకులు తొలగి రుణ సమస్యల నుండి బయటపడతారు. నూతన వ్యాపారాలను మరియు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మొత్తం మీద సింహ రాశి వారు శివరాత్రి నుండి మంచి ఫలితాలను అందుకుంటారు.
Maha Shivratri వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు మహాశివరాత్రి నుంచి అద్భుత యోగం కలగబోతుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఇక ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు క్లిష్టమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వీరి రాబడి భవిష్యత్తులో ఆదాయం పెరిగేలా పెట్టుబడి పెట్టుకోవడం వీరి సమర్థత పై ఆధారపడి ఉంటుంది.
మకర రాశి : మహాశివరాత్రి నుంచి మకర రాశి జాతకులకు అదృష్టం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇక జీవితంలో ఆదాయం అభివృద్ధి పెరుగుతుంది. వీరి పరిస్థితులలో మార్పు ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మేషరాశి : మహాశివరాత్రి తరువాత నుంచి మేష రాశి జాతకులు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇక రాహువు శని కలిసి వచ్చి వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారు. వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో ఆదాయాన్ని పెట్టుబడిల వైపు మళ్లీ ఇస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మంచి పనులు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను ఈ రాశి వారు పొందవచ్చు.
వృషభ రాశి : బుద్ధి కుశలతకు మరియు తెలివితేటలకు కారుకుడైన బుధుడు వృషభ రాశి జాతకులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపించబోతున్నాడు. దీంతో వీరి సంపద పెరగడంతో పాటు గతంలో పెట్టుబడి పెట్టిన ఆదాయాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా ఈ సమయం బాగా కలిసి రావడంతో కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా వృషభ రాశి జాతకులు దాంపత్య జీవితం బాగుంటుంది.