Ayyappa Swamy : అయ్యప్ప జన్మరహస్యం.. శివుడు కామానికి విష్ణువు కడుపులో అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు…!!
Ayyappa Swamy : ఒకప్పుడు రాక్షసులకు మరియు దేవతలకు మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఇక ఈ యుద్ధాలలో దేవతల శక్తి రోజుకి రొజుకి క్షీణించడంతో రాక్షసులు ఎక్కువగా దేవుళ్లను ఓడించేవారు. దీంతో రాక్షసుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతుండేవి. ఇక ఈ ఆగడాలను తట్టుకోలేని దేవతలు అందరూ కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరికి సహాయం కోసం వెళ్తారు . ఇక వారి బాధను మొత్తం మహావిష్ణువుకి చెప్పుకొని సహాయపడమని అడిగారు. దానికి విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. అదేమిటంటే మీరంతా క్షీర సాగర మదనాన్ని అనగా పాలసముద్రాన్ని చిలికినట్లయితే ఆ సముద్రం నుంచి అమృతం బయటకు వస్తుందని , ఇక ఆ అమృతాన్ని దేవతలంతా తాగితే మీకు మరణం ఉండదని అలాగే రాక్షసుల కంటే మీరు శక్తివంతులు అవుతారని చెప్పారు.
అయితే విష్ణువు ఇచ్చిన ఈ సలహా లో ఒక చిక్కు ఉంది. అదేంటంటే పాల సముద్రాన్ని చిలకడమంటే అంత సులువైన పని కాదు. దేవతలంతా కలిసిన కూడా ఈ పనిని చేయలేరు. ఇక ఈ విషయాన్ని దేవతలు విష్ణువును అడగగా మీరు ఈ పనికి రాక్షసులను తెలివిగా వాడుకోండి అని దేవతలంతా ఒకవైపు ఉండి రాక్షసులను అంతా ఒకవైపు ఉంచి చిలికితే ఈ పని సాధ్యమవుతుందని తెలియజేశారు. ఇక ఈ పాల సముద్రాన్ని చిలక్కడానికి మందగిరి పర్వతాన్ని కవంగా, అలాగే ఆ కవ్వాన్ని తిప్పే తాడుగా వాసుకి పాము ని వాడమని , ఇక ఇలా చిలకగా వచ్చిన అమృతాన్ని దేవతలు అంత త్రాగండి ఎట్టి పరిస్థితిలోనూ అమృతాన్ని రాక్షసుల చేతికి ఇవ్వకండి అని విష్ణువు అన్నారు. అయితే ఈ సలహాని దేవతలు ఇష్టపడరు. ఎందుకంటే ఈ పనిలో సాయంగా రాక్షసుల సాయం మాకు వద్దు అనే ఉద్దేశంతో దేవతలకు ఈ సలహా నచ్చదు.
దాంతో దేవతలంతా అలా విష్ణు దగ్గర గురించి వెళ్ళిపోతారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కొంతమంది రాక్షసులు దేవతలను చంపేందుకు బయలుదేరి వస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బలి చక్రవర్తి వారిని వద్దని చెప్పి ఆపుతాడు. మీరు దేవతలను చంపడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి, అదే మీరు ఆ దేవతలను ఉపయోగించి పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందని ఆ అమృతాన్ని మీరు తాగితే మరణమే ఉండదని చెబుతాడు. దాంతో బలి చక్రవర్తి మాటలకు ప్రేరోపితులైన రాక్షసులు ఈ పనికి ఒప్పుకుంటారు. అలా అమృతం కోసం పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలకడం మొదలైంది.
అయితే ఇలా చిలకగా వచ్చే అమృతాన్ని ఇద్దరికీ సమానంగా పంచేందుకు మహావిష్ణువు మధ్యవర్తిగా మోహిని రూపంలో తన రూపాన్ని మార్చుకొని వస్తాడు. ఇలా ఈ సంఘటన కోసం మోహిని రూపంగా మారిన విష్ణువుని అనుకోకుండా శివుడు చూసి మోహిని అందానికి ఆకర్షితుడు అవుతాడు. అలా వీరిద్దరి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజున శనివారం వీరికి ఒక బిడ్డ పుడతాడు. అతడే అయ్యప్ప. ఇక అయ్యప్ప పుట్టగానే శివుడు మరియు మోహిని అయ్యప్ప మెడ చుట్టూ ఓ బంగారు గంటను కడతారు. ఇక వారి కర్తవ్యాలను నిర్వర్తించడం కోసం విధిరాత ప్రకారం అయ్యప్పను పంబానది ఒడ్డును వదిలి వెళ్తారు.