Khairathabad Ganesh : 1954 నుంచి 2023 వరకు ఖైరతాబాద్ గణేష్ ఎలా మారుతూ వచ్చాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khairathabad Ganesh : 1954 నుంచి 2023 వరకు ఖైరతాబాద్ గణేష్ ఎలా మారుతూ వచ్చాడో తెలుసా?

 Authored By gatla | The Telugu News | Updated on :24 September 2023,10:00 am

Khairathabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక హైదరాబాద్ లో కాదు.. తెలంగాణలో కాదు.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినాయకుడు మన ఖైరతాబాద్ గణేష్. ఎత్తులో కావచ్చు.. అక్కడ జరిగే పూజలు కావచ్చు.. అక్కడికి వచ్చే భక్తులు కావచ్చు.. ఎలా చూసుకున్నా ఖైరతాబాద్ గణేష్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. అసలు.. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకుంటే చాలు.. ఏడు జన్మల పుణ్యం అంటారు. ఇక.. ఖైరతాబాద్ గణేష్ ను నిమజ్జనానికి తీసుకెళ్తుంటే చూడటం కూడా భాగ్యం అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ కు ఉన్నన్ని ప్రత్యేకతలు మరే గణేశుడికి లేవు అనే చెప్పుకోవాలి. అందుకే ఖైరతాబాద్ గణేష్ అంత ప్రసిద్ధి చెందింది.

khairatabad ganesh 1954 to 2023

#image_title

అసలు ఖైరతాబాద్ గణేష్ ఎందుకు అంత ఫేమస్ అయింది అనే విషయం చాలామందికి తెలియదు. ఖైరతాబాద్ గణేష్ ను ఎప్పటి నుంచి పెడుతున్నారో తెలుసా? 1954 సంవత్సరం నుంచి ఖైరతాబాద్ గణేష్ ను పెడుతున్నారు. 1954 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆ ప్లేస్ లో గణేష్ ను నిలబెట్టాల్సిందే. గత 70 ఏళ్ల నుంచి కూడా ఈ పద్ధతి కొనసాగుతోంది. వినాయకచవితి వస్తోంది అంటే చాలు ఖైరతాబాద్ లో సందడి నెలకుంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు.

Khairathabad Ganesh : 1954 లో తొలిసారిగా ఖైరతాబాద్ లో విగ్రహం

ఖైరతాబాద్ లో 1954 నుంచి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. 1954 లో సాధారణ విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. 1981 నుంచి ఒక్కో సంవత్సరం వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 2019 లో 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వినాయకుడి విగ్రహం ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు.

భారీ గణపతిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ ఉత్సవాలు 1954 లో ఒక అడుగు ఎత్తు గణేశుడి విగ్రహంతో ప్రారంభం అయ్యాయి. అప్పట్లో ఖైరతాబాద్ కౌన్సిలర్ సింగరి శంకరయ్య.. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తిలక్ పిలుపు మేరకు ఖైరతాబాద్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు. తొలి ఏడాది వినాయక విగ్రహాన్ని పెట్టి నగరం మొత్తం తిరుగుతూ వినాయక నవరాత్రులను అందరూ ఘనంగా నిర్వహించాలని శంకరయ్య కరపత్రాలు పంచాడు.

అప్పటి నుంచి ఏటా వినాయకుడి ఎత్తును పెంచుతూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 1979 లో 20 అడుగుల వినాయకుడిని తయారు చేశారు. 1981 లో 25 అడుగుల నాట్య వినాయకుడు, 1982 లో ముషిక వాహన వినాయకుడితో ఖైరతాబాద్ గణేష్ కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది.

1987 నుంచి వినాయకుడి ఎత్తును క్రమంగా పెంచుతూ వెళ్లారు. 2015 లో 60 అడుగుల భారీ గణపతికి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగరి శంకరయ్య మరణం తర్వాత కూడా ఆయన సోదరుడు సింగరి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్ లో కేవలం పాతబస్తీ, రాంకోటీ, దూల్ పేట్, ఖైరతాబాద్ లలో మాత్రమే ఉత్సవాలు జరిగేవి. 1985 వరకు నెల రోజుల పాటు ఖైరతాబాద్ లో ఉత్సవాలు నిర్వహించేవారు. దసరా రోజున నిమజ్జనం చేసేవారు. అప్పట్లో నెల రోజుల పాటు పలు వేడుకలను నిర్వహించేవారు. ఆ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు.

భక్తుల ఆదరణ పెరుగుతూ ఉండటంతో ప్రజల డిమాండ్ మేరకు ఎత్తును కూడా పెంచుతూ ఉండటంతో అక్కడ ఉన్న భవనం ముందే దేవుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయకుడి ప్రతిమ ఏర్పాటు మొదలుకొని శోభాయాత్ర కూడా నేత్రపర్వంగా సాగుతుంది. చరిత్రలోనే మొదటిసారిగా మట్టి గణపతిగా దర్శనం కూడా ఇచ్చారు ఖైరతాబాద్ గణేష్. కరోనా సమయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి అక్కడే నిమజ్జనం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది