అప్పు నుంచి బయటపడాలంటే ఇలా చేయండి !

0
Advertisement

ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అప్పులు చేయాల్సి రావచ్చు. కానీ కొందరికీ అప్పులు అనేవి నిత్యకృత్యంగా మారుతున్నాయి. దానికి వారికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఆ అప్పుల బాధల నుంచి బయటపడాలంటే శ్రమించి ధనం సంపాదించడమే కాకుండా భగవతుంని అనుగ్రహం పొందాలి. పెద్దలు చెప్పిన కొనిన పరిహారాలను పాటిస్తే మీరు ఎంతటి అప్పు నుంచి అయినా బయటపడుతారు. ఆలాంటి ఒక సులభ పరిహారం గురించి తెలుసుకుందాం…

pooja for earning money
pooja for earning money

మీ అప్పుల బాధ తీరిపోతుంది.. ఉన్న స్థితి నుంచి కొంచెం గొప్ప స్థితికి వెళ్లాలంటే ఇలా చేయండి… ఒక చెంచాడు మంచి గంధం మనం దానిని ఉపయోగించే తీరు విధానంలో శక్తి ఉంటుంది. ఈ పరిహారాన్ని అనుభవ సిద్ధ యోగం అంటారు. మీ ఇంటిలో పూజ గదిలో లక్ష్మీ రూపు లక్ష్మీదేవి పటం పెట్టుకొని 5 రూపాయల బిల్లులను ఎనిమిదిని తీసుకోండి. ఇది అష్టలక్ష్మి అమ్మవారికి సూచన. ఒక చెంచాడు మంచి గంధం పొడిని తీసుకోండి. మంచి గంధం పొడి ని ఒక ఇత్తడి ప్లేట్లో గాని లేదా రాగి ప్లేట్లో గాని నీటితో కలిపి దీనిలో ఈ ఎనిమిది ఐదురూపాయల బిళ్లలను వేసి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టండి. చందనోత్సవం ప్రతి దేవుడికి చేస్తారు. సింహాచల నరసింహ స్వామికి కూడా చందనోత్సవం చేస్తారు. చందనం అనేది కాలగర్భంలో కలిసి పోకుండా ఉంటుంది. అది ఎప్పటికీ నశించకుండా దాని లాగే ఉంటుంది. కాబట్టి ఈ ఎనిమిది 5 రూపాయల బిల్లలని అమ్మవారి ముందు పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఎనిమిది 5 రూపాయల బిల్లలు అవి మనం వాడే డబ్బు స్టీలు అయినా సరే రాగి బిల్లలు అయినా సరే, ఇనుము బిల్లలు మన భారతీయ సంస్కృతి ధనాన్ని లక్ష్మీ అమ్మవారుగా భావిస్తాం కాబట్టి అది ఎలాంటి అయినా అది లక్ష్మీ అమ్మవారే ఈ ఎనిమిది ఐదు రూపాయల బిల్లలని గంధపు ప్లేటులో ఉంచి లక్ష్మీ అమ్మవారి రూపం ముందు పెట్టి ప్రతిరోజు ప్రాత కాలంలో స్నానమాచరించి అమ్మవారికి దీపం పెట్టి మనసులో ఉన్న బాధను కోరికను తలచుకొని దండం పెట్టండి. అమ్మవారిని నీవు మా గృహంలోనే ఉండాలని దండం పెట్టుకోండి.

ఎట్లా అంటే 5 రూపాయల బిల్లలు మంచి గంధం ఎలా పట్టుకుంటుందో అలాగే మమ్మల్ని మా గృహాన్ని కూడా ఆ విధంగానే పట్టుకొని ఉండమని అమ్మవారికి విన్నవించుకోండి. నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ గృహంలో లక్షీదేవి నిలిచిపోతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉన్న డబ్బు కంటే రెట్టింపు డబ్బు వస్తుంది. ఏ పని చేసిన దైవ సంకల్పంతో, నమ్మకంతో విశ్వాసంతో చేయడంవల్ల అన్ని బాధలు తొలగిపోతాయి. అంతా సంతోషంగా ఉంటారు. అమ్మవారికి పవిత్రత పాటించండి. బయట ఉన్న మూడు రోజులు దీపం పెట్టడం అలాంటివి చేయకండి. ఇలా కొంత కాలం చేస్తే శ్రీలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. ఎటువంటి ఖర్చులేని ఈ చిన్న శక్తివంతమైన పరిహారాన్ని మీరు ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. ఏ పరిహారానైన్నా పాటించే టప్పుడు తప్పక దానిమీద భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ముఖ్యం. విశ్వాసంతో చేస్తే తప్పక మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

Advertisement