Raksha Bandhan : రాఖీ పండుగ రోజు ఈ రంగు రాఖీలు కడితే అన్ని శుభాలే ..లాభాలే లాభాలు!!
Raksha Bandhan : హిందూ సాంప్రదాయంలో రాఖీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ బంధాన్ని మరింత పెంచుకునేందుకు రాఖీని కడతారు.ఈ రాఖీని రక్షా సూత్రమే కాకుండా ప్రేమకు చిహ్నం గా కూడా భావిస్తారు.అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు ముందు నుంచే రంగురంగుల రాఖీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అక్క చెల్లెల్లు సోదరుడి పుట్టిన రోజు బట్టి ఆ రంగు రాఖీలను కట్టాల్సి ఉంటుంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం కొన్ని రంగుల రాఖీలు సోదరుడికి కట్టడం వలన అదృష్టం రెట్టింపు అవుతుంది.
అంతేకాకుండా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆగస్టులో పుట్టిన సోదరులకు గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ రాఖీలను కట్టడం వలన ప్రేమ మరింత పెరుగుతుంది. దీంతోపాటు జీవితంలో శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సోదరులకు వృత్తి తో పాటు మనోబలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఆగస్టులో జన్మించిన సోదరులకు నారింజ రంగు రాఖీ కూడా కట్టొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రంగు జీవితంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరెంజ్ రాఖీ సోదరుడికి శుభాన్ని కలుగజేస్తుంది.
ఈ రాఖీ కట్టడం వలన మనసు ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది. సోదరులకు ఎరుపు రంగు రాఖీ కట్టడం కూడా మంచిది అని జ్యోతిష్యం చెబుతుంది. బలం, అంకిత భావం కూడా పెరుగుతుంది. ఎరుపు రంగు రాఖి అన్నదమ్ముల బంధాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికత వైపు దృష్టి మల్లుతుంది. గోల్డెన్ కలర్ రాఖీ కూడా సోదరులకు కట్టొచ్చు. ఈ కలర్ రాఖీ విజయం, ఆనందం, శ్రేయస్సుకి సూచికగా గుర్తిస్తారు. అంతేకాకుండా రాఖీ పండుగ రోజు సోదరీమణులు గోల్డెన్ కలర్ రాఖీలను కట్టడం వలన బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.