Sankranti Special : తిథితో సంబంధం లేని అతి పెద్ద పండుగ సంక్రాంతి.. దాని పాముఖ్యత..!
Sankranti : సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా పండుగ నిర్ణయిస్తారు. తెలుగు వారికే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలలో సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పండుగ. దీనిలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి.భోగి పండుగ విశేషాలు ఇవే !భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. వాస్తవానికి పాడి సమృద్ధిగా ఇండ్లకు వచ్చే సమయం. తెల్లవారు ఝామున భోగి మంటలతో ప్రతిచోట కోలాహలం ప్రారంభం అవుతుంది. భోగి మంటలతో బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడును విడిచిపెట్టే రోజు ఇది. భోగి రోజు ప్రాతఃకాలమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. దీనివెనుక అర్థం..
పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను దూరం చేసుకుంటారు.భోగి విశేషాలు…ఐదేండ్లు లోపు భోగి పండ్లను పోయడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల బాలారిష్టాలు, ఇతరత్రా దోషాలు ఏవైనా ఉన్న పోతాయని పెద్దలు చెప్తారు. చిన్న పిల్లలకు భోగి పండ్లను సాయంకాలం వేళలో పోస్తారు. దీనికోసం ప్రత్యేకం పేరంటాలను కూడా ఏర్పాటు చేస్తారు. భోగి పండ్లు పోసే విధానం పరిశీలిస్తే.. రేగుపండ్లు, చిల్లర నాణేలు, బియ్యం పిండితో చేసిన నువ్వుల నూనెలో వేయించిని చిన్ని చిన్ని పాలకాయలు లేదా తాల్కలు, చెరుకుగడ ముక్కలను కలిపి ఐదేండ్ల లోపు ఉన్న పిల్లలపై పోస్తారు.
వీరికి నూతన దుస్తులు వేస్తారు. అనంతరం వీరిని పీటలు లేదా చాపలపై కూర్చొబెట్టి పండ్లు పోస్తారు. సంక్రాతిం అంటే సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని ఆకారంలో గుండ్రని రూపంలో ఉన్న పాలక్కాయలు పోస్తారు.అంతేకాకుండా రేగి పండ్లు ఎరుపు రంగులోవి పోస్తారు. వీటికి అర్కపలం అని కూడా పేరుంది. సూర్యకిరణాలలోని మంచివాటిని ఆకర్షించే శక్తి వీటికి ఉందని పెద్దలుచెప్తారువీటిని పిల్లల పోయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా పేరంటంతో ముత్తైదవులకు పసుపు, కుంకుమలను ఇస్తారు.ధనుర్మాసంలో, దక్షిణాయనంలో చివరిరోజు ఈ భోగి రోజు. అత్యంత పవిత్రమైనదిగా ఆధ్యాత్మికంగా భావిస్తారు.