Temples Secrets : భారతదేశంలో అతి రహస్యమైన ఆలయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Temples Secrets : భారతదేశంలో అతి రహస్యమైన ఆలయం…!!

 Authored By aruna | The Telugu News | Updated on :15 July 2023,6:00 pm

Temples Secrets : పూరి జగన్నాథ ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలం. ప్రపంచం మొత్తంలోకి ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధమైన చార్ధామ్ క్షేత్రంలో ఇది ప్రత్యేకమైనది.. పాండవులు యమరాజు దగ్గరకు వెళ్తూ మోక్షానికి దగ్గర క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట.. అంత గొప్ప ప్రాంతం ఊరిలోని జగన్నాథ ధామం. మరి అలాంటి ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కు అంత చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఈ పూరి జగన్నాథ ఆలయంలోకి పూజారి తప్ప ఎవ్వరిని ఆలయంలోకి అనుమతించరు. విగ్రహాన్ని మార్చే సమయంలో పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని చేతికి వస్త్రాన్ని కడుక్కునే విగ్రహాలను మారుస్తారు. ఎవరైనా సరే కళ్ళకు గంతలు కట్టుకోకుండా ఆ విగ్రహాలను మారిస్తే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడు.

ఆలయం యొక్క వాస్తు కళా శిల్పకళ గురించి ఈరోజు వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు 214 అడుగుల ఎత్తులో అష్టధాతువులతో తయారుచేసిన సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఊరిలో ఎక్కడి నుంచైనా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైఫై తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఈ చక్రం ప్రత్యేకత.. జనరల్గా సముద్రతీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకు వీస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో భూమి నుంచి సముద్రం వైపుకు గాలి వీస్తూ ఉంటుంది. కానీ పూరీ జగన్నాథ స్వామి ఆలయం దగ్గర మాత్రం సముద్ర తీరం దగ్గర దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి పెట్టింది పేరు అంటారు. కొందరు మనకు లేని ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పట్లోనే ఉందని చాలామంది అభిప్రాయం. ఈ స్వామి వారికి పెట్టే ప్రసాదం ఏంటంటే క్రింద ఉన్న కుండల కంటే పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది.

The most mysterious temple in India

The most mysterious temple in India

దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి కూడా ఉండదు.. కానీ ఒక్కసారి జగన్నాథుడికి సమర్పించాక ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. చాలా మధురంగా మారిపోతాయి. జగన్నాథ మందిరంలో వంటగది చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ రోజు 500 మంది వంట చేసే వాళ్ళు మరో 300 మంది సహాయకులు ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. రత్న బాండార్ పై గత 45 ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. గతంలో రాజులు భక్తులు సమర్పించిన బంగారు వజ్ర వైడూర్యాలు రత్నాభరణాలు ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా వీటిని ఒకసారి లెక్కించాలని 1984లో అప్పటి దేవాలయం అధికారులు భావించారు.

మొదటి మూడు గదులను తెరిచి సంపదను లెక్క పెట్టారు. 4వ గది తెరవబోతుండగా పాము బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించడంతో మిగతా గదులను తెరవకుండా లెక్కింపును ఆపేశారు. ప్రస్తుతం ఉన్న జగన్నాధ ఆలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంత వర్మ చూడ గంగాదేవి నిర్మించాడు. 1874లో ఒడిశా పాలకుడైన అనంగా భీమదేవ దీన్ని పునర్మించాడు. దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథ స్వామిని కొలిచేవారు. తర్వాత కాలంలో రామచంద్ర దేవా కొలుతా అనే స్వతంత్ర రాజ్యాన్ని వర్షాలు ఏర్పరిచిన మందిరంలో ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పున ప్రతి ష్టించాడు. ఇలా పూరీలో జగన్నాధులను కొలుస్తారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది