Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు 25న లేదా 1వ తేదీన ఏ శుక్రవారం చేసుకోవాలి…!!
Varalakshmi Vratam : వరలక్ష్మి వ్రతం ఎప్పుడు 25వ తేదీ ఆ లేదా ఒకటవ తేదీన ఏ శుక్రవారం చేసుకోవాలి. పూజ గురించి ఎన్నో అనుమానాలు మరి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? ఎటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఏదైనా నియమనిష్టలు ఉన్నాయా.. పూజ గురించి ఎన్నో అనుమానాలు ఇవన్నీ కూడా మనం నివృత్తి చేసుకుందాం.. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలని ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి.. వరా అంటే భక్తితో వేడుకుంటే వరాల అందించే తల్లి వరలక్ష్మి దేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు మడులు అవసరంలేదు.
వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం అనేది తప్పనిసరి. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానాన్ని ఆచరించాలి. అంటే ఇక్కడ శ్రావణమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆ రోజు ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో వారికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇలా ఇల్లు అలిగి మండపం ఏర్పాటు చేయడం అనేది జరగదు. కాబట్టి మన ఇంటి ముందర చక్కగా రంగవల్లికలతోటి అలంకరించుకోవాలి.
మన ఇంటి గడపని రంగవల్లికలతోటి అలంకరించుకొని పసుపు కుంకుమతో ఇంటి గడపని పూజించుకోవాలి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించలేకపోతే ఒకవేళ ఆ రోజు గనుక వీలుకాకపోతే తర్వాత వచ్చే శుక్రవారం లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ కథ విని అక్షితలు వేసుకోవాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరాధించాలి. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే వరలక్ష్మి దేవి చక్కటి వరాలను అందిస్తుంది…