Vastu Tips : వాస్తు ప్రకారం గా ఈ 5 మొక్కలు మీ ఇంట్లో నాటినట్లయితే.. మీరు పట్టిందల్లా బంగారమే..
Vastu Tips : మొక్కలు రకరకాల పూలను, కాయలను, పండ్లను మనకు అందజేస్తాయి. ఈ మొక్కల వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో మొక్కలు నాటడం వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అదేవిధంగా మనకు మొక్కల నుండి ఆక్సిజన్ కూడా లభిస్తుంది. అయితే మొక్కలను వాస్తు ప్రకారమే నాటాలి. అని అలాగే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉండటం వలన, మనకు అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటున్నారు జ్యోతిష్య శాస్త్రులు..అయితే ఆ మొక్కలు ఏంటో .?వాటిని ఏ దిశలో నాటాలో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1) మనీ ప్లాంట్ ఈ మొక్కను డబ్బుల మొక్క అని అంటారు. ఈ మొక్క ఇంట్లో నాటడం వలన ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగిపోయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అని చెప్తున్నారు. ఈ మనీ ప్లాంట్ ను ఆగ్నేయంలో నాటడం వలన కొన్ని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. 2)వది. తులసి మొక్క ఈ తులసి మొక్క ను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ తులసి మొక్క ఇంట్లో ఉండడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. ఎటువంటి శుభకరమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ తల్లికి దండం పెట్టుకొని వెళ్లడం వలన, అన్ని మంచి ఫలితాలను పొందుతారు. ఈ తులసి మొక్కను దక్షిణంలో నాటి ప్రతిరోజు పూజ చేస్తూ ఉండాలి.3)వది. లక్కీ బ్యాంబు మొక్క ఈ మొక్కను, లక్కీ వెదురు అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఎక్కువగా ఇంట్లో డెకరేషన్ ప్లేస్లలో ఉంచుతారు. ఈ లక్కీ వెదురు మొక్క ఇంట్లో ఉండడం వలన, లక్ష్మీదేవి ఆ ఇంట్లో నాట్యం చేస్తుందంట. అంటే మీకు ఇక డబ్బుకు కొరత ఉండదు. అలాగే ఈ మొక్కను ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఎక్కడైనా ఉంచుకోవచ్చు.
4)వది. అశోక మొక్క ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఇంట్లో ఉన్న గ్రహ పీడలు, గ్రహ దోషాలు తొలగిపోయి. అన్ని శుభాలే జరుగుతాయి. ఈ మొక్కను ఉత్తర దిశలో నాటాలి.5)వది. మామూలుగా చాలామంది అరటి మొక్కను ఇంట్లో నాటవద్దు అని చెబుతుంటారు. అయితే ఈ అరటి మొక్కను ఇంటి ముందు కాకుండా.. పెరట్లో కానీ ,ఇంటి వెనక ఆవరణలో కానీ నాటినట్లయితే మంచిది. అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రులు.. అయితే దీనివలన ఇంట్లో అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే ,వారి అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోయి. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ మొక్క అంటే సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టం.. కాబట్టి ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా 5 రకాల మొక్కలను మీ ఇంట్లో నాటడం వలన, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.