Vinayaka Chavithi : వినాయక చవితి రోజున ఈ 5 ప్రసిద్ధి దేవాలయాలను దర్శించుకుంటే అన్ని శుభ ఫలితాలే…
Vinayaka Chavithi : జీవన విధానంలో మనం చేసే కొన్ని శుభకార్యాలు అలాగే కొన్ని పనులలో ఎలాంటి ఆపదలు, ఆటంకాలు రాకుండా అంతా మంచే జరగాలని గణేశుని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు పండుగలు ఎంతో సంబరాలుగా జరుపుకుంటూ ఉంటారు. మనదేశంలో పండగలు మొదలయ్యాయి. ఇక శ్రావణమాసం అయిపోయిన తదుపరి వినాయక చవితి పండుగ అనేది సహజంగా ఆగస్టు లేక సెప్టెంబరు లో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం 31 ఆగస్టున ఈ వినాయక చవితి వచ్చింది. గణేష్ ఉత్సవం అని కూడా పిలవబడే ఈ వినాయక చవితి తదుపరి చతుర్దశి నాడు ముగుస్తుంది. ఈ వినాయక చవితి లాస్ట్ రోజున గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 9న వస్తుంది. అయితే ఈ వినాయక చవితి రోజున మన భారతదేశంలో ఉన్న ప్రసిద్ధి గణేష్ ని ఆలయాలు ఎక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చెన్నై – వరసిద్ధి వినాయక గుడి: ఈ ఆలయం తమిళనాడు రాజధానులు చెన్నైలోని బీసెంట్ సిటీలో ఉన్న ఐకానిక్ గుడి గణేష్ గుడి. ప్రతి ఏడాది వినాయక చవితి నాడు గొప్ప వేడుకలు జరుపుకుంటారు. ఈ గుడి సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. పేదలకి ఆహారం ఇవ్వడం వంటి కొన్ని సామాజిక కార్యక్రమాలను కూడా ఈ ఈ గుడి చేపడుతుంది.కేరళ – కలమస్పేరి మహాగణపతి ఆలయం: ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యం, గణేశుడు,నవగ్రహాలు, రాముడు శివ, పార్వతి లాంటి ఇతర హిందూ దేవతలు ఉంటారు. ఈ దేవాలయం 1980 లో కలమ స్పేరి ఎన్ రఘునాథ మీనన్ నిర్మించారు. ఇక్కడ గజ పూజ ప్రతి నాలుగు ఏండ్ల ఒకసారి జరుగుతుంది. భక్తులు ఏనుగులను గణేశుడి అవతారంగా పిలుచుకుంటారు. ముంబై – సిద్ధి వినాయక ఆలయం: ముంబైలోని ఎంతో ముఖ్యమైన ఆలయం గణేష్ ఆలయం ఒకటి. సామాన్యుల తో పాటు ప్రముఖులు సెలబ్రిటీలు ఈ దేవాలయాన్ని దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడి దేవుడిని నవచాచా గణపతి అని కూడా పిలుస్తారు.
పూణే – దగ్దు షేత్ హల్వాయి గణపతి ఆలయం: పూణేలో ఉన్నటువంటి ఈ ఆలయం 130 సంవత్సరాల నాటిది దగుదు షేక్ హల్వాయి గణపతి ఆలయం. వేలాది మంది భక్తులు స్వామివారిని సందర్శించుకుంటారు. చరిత్ర విధానంగా నందుగావక్ కు చెందిన వ్యాపారి. స్వీట్ మేకర్ శ్రీమంత్ దగదు షేత్ హల్వాయి, తన భార్య లక్ష్మీబాయి పూణేలో స్థిరపడ్డారు. ఈ స్వీట్ షాప్, యజమాని దగదు సేతు ఆరోజు ప్లేగు వ్యాధితో చనిపోయిన తన కొడుకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం గణపతి పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. జైపూర్ – మోతి దుంగ్రి గణేష్ దేవాలయం: 1761 లో నిర్మించిన ఈ దేవాలయానికి 250 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నది. కొండలు, కోటలతో చుట్టుముట్టుబడి జైపూర్ పురాతన ఆలయాలలో ఒకటి గణేష్ ని ఆలయం. గణేష్ విగ్రహం దాదాపు 500 సంవత్సరాల నాటిది. ఈ విగ్రహాన్ని ఉదయపూర్ నుండి తీసుకురాబడిందని ఈ దేవాలయంలో శివలింగం కూడా ఉంటుంది. మహాశివరాత్రి నాడు అత్యంత సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో గణేశుడు సింధూర రంగులో ఉండి తొండం కుడివైపు ఉంటుంది.