Vinayaka Chavithi : వినాయక చవితి ఎప్పుడు.. 18నా లేక 19నా ఎప్పుడు జరుపుకోవాలి..!
Vinayaka Chavithi : వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి. సెప్టెంబర్ 18న లేక సెప్టెంబర్ 19న ఈ అనుమానం ఇప్పుడు అందరిలోనూ ఉంది. మరి వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి? దానికి చూడాల్సిన ముహూర్తం ఏ విధంగా ఉంటుంది. అనే విశేషాలు మనం తెలుసుకుందాం. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 18న వచ్చిందా.. హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతి పెద్ద పండుగలో ఒకటి. ఇదిలా ఉండగా ఏడాది సెప్టెంబర్ 18 19వ తేదీల్లో చతుర్థి ఉంది. దీంతో కొందరు ఈనెల సెప్టెంబర్ 18న సోమవారంనాడు జరుపుకోవాలని మరికొందరు 19న మంగళవారం రోజు జరుపుకోవాలని చెబుతూ ఉండటంతో మరొకసారి సందిగ్ధత అనేది నెలకొని ఉంది. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నేపథ్యంలో కానిపాకం తిరుమల పండితులతో పాటు ఇతర పండితులు కూడా వినాయక చవితి పండుగ తేదీ పై స్పష్టత ఇచ్చారు. ఈనెల అంటే సెప్టెంబర్ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు తదియ, తిధి ఉంటుందని ఆ తర్వాత చతుర్థి తిథి మధ్యాహ్నం సెప్టెంబర్ 18న సోమవారం నాడు ప్రారంభమై మరుసటి రోజు అంటే 19 సెప్టెంబర్ 2023వ తేదీ రాత్రి 8 గంటల 43 నిమిషాలకు ముగియనుంది. ఉదయం తిది ప్రకారమైతే గణేష్ చతుర్ధిని సెప్టెంబర్ 19వ తేదీనే జరుపుకోవాలి. అయితే 2000, 2009, 2010, 2019 సంవత్సరంలోనూ ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు ఎదురవడంతో తదియ తిధితో పాటు చతుర్థి రోజునే వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించినట్లు పండితులు గుర్తు చేశారు.
వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా సెప్టెంబర్ 18 వ తేదీనే వినాయక చవితి అని స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి 21 రోజులపాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తో పాటు పలు కాలనీలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్ 18 వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తిశ్రద్ధలతో చేసుకునేటువంటి పండుగ ఈ వినాయక చవితి ఏటా బాద్రపద చవితి రోజు వచ్చేటువంటి వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం మరి చవితి పండుగ రోజు ఎటువంటి సందేహం లేకుండా సెప్టెంబర్ 18 వ తేదీని వినాయక చవితిని ఈ సంవత్సరం మనం జరుపుకోబోతున్నాం.
సెప్టెంబర్ 18 వ తేదీ నుండి 10 రోజులపాటు దేశమంతా ఆధ్యాత్మిక సందడి అనేది నెలకొని ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే ఈ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం కదా.. విజ్ఞాన తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి పూజలు చేస్తూ ఉంటారు. మరలా గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. అనేది మన నమ్మకం. వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలోను సుఖశాంతులు నెలకొని ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు…