Devotional News : ఆలయ గోపురం ఎందుకు ఎత్తుగా కట్టాలి, దాని వల్ల లాభం ఏమిటి?
Devotional News : దేవాలయం అంటే లక్షోపలక్షల భక్తుల పుణ్యధామం. ఆగమ శాస్త్ర బద్ధంగా దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. అయితే ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయన రీతిలో నిమిస్తారు. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయం మంటపం భగవంతుడి కడుపు. దైవ దర్శనం అంటే గుడిలోకి వెళ్లి స్వామిని చూసి గంట కొట్టి నమస్కరించాలి అనుకుంటుంటాం. ఆ పద్ధతినే పాటిస్తుంటాం. కానీ దూరంగా ఉండి కూడా ఆలయ గోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి. అంతే కాకుండా దేవాలయం ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణించబడుతూ… పోషింప బడుతూ, రక్షింప బడుతూ, దర్శింప బడుతూ ఉండాలి.
దాతలు ఎవరైనా దేవాలయానికి దానిధికాలు చేయొచ్చు. అలాగే పోషకులుగా కూడా ఉండొచ్చు. వేశ్యలు కూడా దేవాలయాలను కట్టించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సర్వ జనానికానికి, పొరుగు వారికి, పరదేశ వాసులకు, కొత్తగా వచ్చిన వారికి దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవడానికి ఆలయం గోపురం ఎంతో ఉపయోగ పడుతుంది. వేరే గ్రామాల్లో ఉన్న ఆలయాలను చూసేందుకు వెళ్లేటప్పుడు సమయం మించిపోయి ఆలయం మూసి వేస్తే.. దూరం నుంచే గోపురానికి దండం పెట్టుకోవచ్చు. ఆ తర్వాతి రోజు వెళ్లి దేడివికి నమస్కారం చేసుకోవచ్చు. అందుకే ఆలయ గోపురాన్ని ఊరి చివరన ఉన్నా కనిపించేలా నిర్మిస్తుంటారు.దేవాలయ గోపురమే కాదు ఆలయం కూడా ఎత్తు మీద ఉండటం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.
అందుకే చాలా వరకు దేవాలయాలు కొండలు, గుట్టల మీద ఉంటాయి. ఎందుకంటే మానవుడు ఎంతటి తెలివకలవాడైనా ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేడు. వరద బీభత్సాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవల్సిందే. అటువంటి ప్రకృతి ప్రళయ సమయంలో ప్రాణులను కాపాడ గల్గిన స్థలం దేవాలయమే. దేవుడ సర్వోన్నతుడు. ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతీసారి… అందరికీ బోధపడేలా చేసేందుకే గోపురాన్ని వీలయినంత ఎత్తుగా నిర్మిస్తుంటారు. హిందు దేవాలయాలే కాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం(మినార్) నిర్మిస్తారు. చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.