Anchor Ravi : సెలబ్రిటీలను గొర్రెల్లా అవమానిస్తున్నారు.. ‘బిగ్ బాస్’పై యాంకర్ రవి తల్లి ఉమ సంచలన కామెంట్స్..
Anchor Ravi : బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న రియాలిటీ షోస్‌లో ఒకటి ‘బిగ్ బాస్’. వివిధ భాషల్లో ఈ రియాలిటీ షోస్ రన్ అవుతున్నాయి. తెలుగు భాషలో సీజన్ ఫైవ్ నడుస్తోంది. ఈ షోకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ పధ్నాలుగో వారంలో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. కాగా హౌజ్ నుంచి ఎలిమినెట్ అయిన కంటెస్టెంట్ యాంకర్ రవి తల్లి ఉమా రాణి ‘బిగ్ బాస్’ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది.‘బిగ్ బాస్’ షోను పలువురు ప్రశంసిస్తున్నారు. కానీ, ఈ షోను విమర్శించే వారు కూడా ఉన్నారు.
సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ‘బిగ్ బాస్’ షోపైన చాలా సార్లు విమర్శలు చేశారు. శ్రీరెడ్డి, మాధవీలతలు కూడా విమర్శించారు. తాజాగా యాంకర్ రవి తల్లి కూడా ‘బిగ్ బాస్’షోపైన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో యాంకర్ రవి మదర్ ఉమా రాణి మాట్లాడుతూ తన కొడుకు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినపుడు అతడి ఫ్యాన్స్ డీజేతో వెల్ కమ్ చెప్పారని పేర్కొంది. ఈ క్రమంలోనే తన కుమారుడు ప్రెషర్ కుక్కర్ నుంచి బయటకు వచ్చాడని అంది.

anchor ravi uma rani sensational comments on big boss show
Anchor Ravi : కాన్సెప్ట్ మార్చకపోతే బిగ్ బాస్‌ను ఎవరూ చూడరంటున్న యాంకర్ రవి తల్లి..
రవిని ‘బిగ్ బాస్’షోలో వాళ్లు ఎన్ కౌంటర్ చేసినట్లు తనకు అనిపించిందని తెలిపింది. ఇకపోతే తన కొడుకు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా ఉండాల్సిన వాడని, కానీ, ఇలా ఎలిమినేట్ కావడం ఆశ్చర్యకరమని అంది. ఈ రియాలిటీ షోలోకి సెలబ్రిటీలను తీసుకెళ్లి మేకల్లా లేదా గొర్రెల్లా అక్కడ ఉంచుతున్నారని, అక్కడ ఇండస్ట్రీ పర్సన్స్ ముందరే అవమానిస్తున్నారని ఆరోపించింది. బిగ్ బాస్ కాన్సెప్ట్ మార్చాలని, లేకపోతే ఈ షోను ఎవరూ చూబోరని అంది. ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు యాంకర్ రవి తల్లి ఉమ నిజాలు చెప్పిందని అంటున్నారు. అయితే, యాంకర్ రవిని ‘బిగ్ బాస్’ వేదికపై ఉమారాణి అప్పట్లో అభినందించిందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.