Anchor Suma : దెయ్యంలాంటి సుమ!.. పరువుతీసుకుంటున్న యాంకర్
Anchor Suma : యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత ఫన్నీగా అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వేరే వాళ్లు తన మీద సెటైర్లు వేయకముందే తన మీద తానే వేసుకుంటూ ఉంటుంది. అలాంటి సుమ.. తన ఫిట్ నెస్, తన గ్లామర్, అందం మీద అప్పుడప్పుడు కౌంటర్లు వేసుకుంటుంది. ఇక వయసు గురించి వచ్చినప్పుడల్లా తనకు పదహారేళ్లు అని కౌంటర్లు వేసుకుంటుంది.ః
అలాంటి సుమ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బుల్లితెర, వెండితెర అని కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదించేస్తోంది. వాణిజ్య ప్రకటలను తన సోషల్ మీడియా ఖాతాలో బాగానే ప్రమోట్ చేస్తోంది. ఆ మధ్య పుడ్, పచ్చళ్లు అంటూ రకరకాల వీడియోలు షేర్ చేసింది. ఇప్పుడు బ్యూటీ టిప్స్ అంటూ క్రీముల గురించి ప్రమోషన్ చేసుకుంది.
Anchor Suma Neutriderm face Cream
Anchor Suma : సుమ మేకప్ వీడియో..
న్యూట్రిడిమ్ అంటూ ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చిందట.. దాని గురించి చెబుతూ.. లైవ్‌లొ మొహం కడుక్కుంది. మాయిశ్చరైజేషన్ చేసుకుంది. ఇంతకు ముందు చూసిన దెయ్యం సుమ కంటే ఇప్పుడు బాగుంది కదా? అంటూ తన మీద తానే సెటైర్లు వేసుకుంది. న్యాచురల్‌గా ఉంటే బాగుంటుందని అంతా అంటారు.. కానీ అలా న్యాచురల్‌గా ఉండేందుకు కూడా ఇలాంటివి రాయల్సి వస్తుందని సుమ తెలిపింది.
View this post on Instagram