Avinash : మళ్లీ పెళ్లి చేసుకుంటానన్న అవినాష్.. కారణం ఏంటో తెలుసా?
Avinash : జబర్ధస్త్ షోతో కమెడీయన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్.ఈ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలోను అడుగుపెట్టాడు. అక్కడ మనోడు చేసిన సందడికి ప్రేక్షకులు తెగ ఫిదా అయ్యారు. బిగ్ బాస్ నుండి బయటకువచ్చాక అవినాష్ పలు కామెడీ షోలు చేస్తూ సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి పెళ్లి అంటూ తెగ కలవరించిన అవినాష్ బయటకు వచ్చాక పెళ్లి పీటలు ఎక్కాడు.గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన గ్రాండ్‌గా హైద్రాబాద్‌లో అనుజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అవినాష్. ఈ వేడుకలో శ్రీముఖి, విష్ణు ప్రియ, రామ్ ప్రసాద్ పలువురు ప్రముఖులు సందడి చేశారు.
అయితే అవినాష్ ప్రస్తుతం మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. ఈ షోలో స్కిట్‌లో భాగంగా అవినాష్ చేసే కామెడీ నవ్వులు పంచింది. పెళ్లికి పిలవకపోతే ఇంత పగ పెట్టుకుంటారా అంటూ సెటైర్స్ వేస్తాడు. వాళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటా అంటాడు అవినాష్. అలానే నా పెళ్లిలో వ్లాగ్ చేసేందుకు అది ఎవతిరా? అంటూ ఊగిపోతోన్నాడు. నాకూ ఓ యూట్యూబ్ చానెల్ ఉంది.. నేను వీడియో తీసుకుని వ్లాగ్ చేసుకుందామని అనుకున్నా.. కానీ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి అంతా వీడియో తీసింది.. వ్లాగ్ చేసేసింది.. నాకు వ్యూస్ రాలేదు అని అవినాష్ తన బాధను వ్యక్తం చేశాడు. ఇదంతా స్కిట్ కోసమే చేసినా కూడా నిజంగానే తన మనసులోనూ ఉన్నట్టుంది.

avinash fire on vishnu priya
Avinash : పెళ్లి పీటలెక్కబోతున్నాడా..
బూతు కామెడీ చేయడంతో దిట్ట అయిన అవినాష్‌తో కలిసి ఇంతక ముందు ఓ షోలో రెచ్చిపోయింది విష్ణు ప్రియ. ఇక అవినాష్ కళ్ల నిండా కామాన్ని నింపుకున్నవాడిలా.. నిన్ను చూస్తుంటే నాకు బీపీ లేస్తుంది అని అవినాష్ ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుని తెగ నలిపేసుకుంటుంటే.. ‘నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముకేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే మకేశ్వరి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాబులా అని డాన్స్ చేద్దాం అని తెగ గింజుకుంది విష్ణు ప్రియ. కూపీ.. నీ కళ్లలో కరువు కనిపిస్తుందని విష్ణు ప్రియ అంటే.. అయితే కరువకు ముందే వెళ్లిపో.. ఈ ఫైర్ ఎఫైర్‌గా మారకముందు వెళ్లిపోండి ప్లీజ్ అని కామరాజు అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వదిలాడు. అప్పట్లోదీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అయింది.