Bigg Boss OTT Telugu : అఖిల్, అషూ రెడ్డి మధ్య లవ్ ట్రాక్.. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది..!
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో కొందరి మధ్య ప్రేమ పుట్టడం మనం చూస్తూనే ఉన్నాం. వారు నడిపే లవ్ ట్రాక్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేముందు స్టేజ్‌పై నాగార్జున అడగకుండానే.. లవ్ ఎఫైర్స్ లాంటివి ఏం పెట్టుకోను సార్ అని చెప్పిన అషురెడ్డి.. హౌస్‌లోకి వచ్చిన తరువాత మాత్రం అదే పనిలో పడింది. అఖిల్ పేరు చెప్పేసరికి తెగ మెలికలు తిరిగిపోతుంది. లవ్ అన్నా.. రొమాన్స్ అన్నా.. తహతహలాడిపోతున్న బ్యూటీ అషురెడ్డి.. అఖిల్‌కి అంటిపెట్టుకునే కనిపిస్తుంది. ఆ అలకరాజ్ దగ్గరకి వెళ్లి ఈమె అలగడం.. తరువాత సారీలు చెప్పుకోవడంతో బండిని లవ్ ట్రాక్ ఇక్కించే డ్యూటీ ఎక్కేశారు. ముఖ్యంగా అషురెడ్డి అయితే.. అప్పట్లో మోనాల్ గజ్జర్ ప్లేస్‌ని భర్తీ చేయడానికి తెగ ప్రయత్నిస్తోంది.
ఉగాది సందర్భంగా యాంకర్ సుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న సభ్యులందరినీ అలరించింది. ముందుగా ఒక్కో కంటెస్టెంట్ ని ఒక్కో పిండి పదార్థంతో పోలుస్తూ ఎందుకు అలా పోల్చాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా చాలా ఆసక్తికరంగా చెప్పింది. ఆ సమయంలో ఎక్కువగా ఏ అనే పేరు ఉన్న మగవాళ్ళతో స్నేహం చేస్తున్నావు ఏమిటి అంటే అది అలా కుదిరింది అని అషు చెప్పింది. అయితే ఎవరెవరితో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పమనగా అజయ్ అన్నయ్య అని అనిల్ రాథోడ్ క్రష్ అని అఖిల్ లవ్ అని చెప్పుకొచ్చింది. సుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయిన తరువాత అఖిల్ అరియానాతో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ కనిపించాడు.

Bigg Boss OTT Telugu akhil Ashu Reddy in love track
Bigg Boss OTT Telugu : ఇద్దరి మధ్య ఏ ట్రాక్ నడుస్తుంది..
తాను మొదటిసారి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన స్నేహితులను సంపాదించానని ఈసారి స్నేహితుల కోసం కాదు ఆట ఆడడం కోసమే లోపలికి వచ్చాను అని చెప్పుకొచ్చారు. అంతేగాక తనకు ఎవరిమీద ఫీలింగ్స్ కలగడం లేదని అందుకే వాటి జోలికి వెళ్లకుండా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. మరోపక్క అషు కూడా నటరాజ్ మాస్టర్ తో కూర్చుని కబుర్లు చెబుతూ నాకెందుకో అతను అందరితోనూ ఒకలాగే ఉంటున్నాడు నేనే ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నాను ఏమో అనిపిస్తోంది. అలా కనెక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది ఇక మీదట అలా ఉండకుండా ఉండడానికి చూస్తాను. నాకెందుకో ఇది కరెక్ట్ కనిపించడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది